YS Jagan : “డిజిటల్ బుక్” తో కార్యకర్తలకు న్యాయం చేస్తాం : వైయస్ జగన్

కూటమి పరిపాలనలో అన్యాయానికి గురవుతున్న కార్యకర్తలకు న్యాయం చేస్తామని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ ప్రదాన కార్యాలయంలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన “డిజిటల్ బుక్” యాప్ ను ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు తమకు జరిగిన అన్యాయాలను పార్టీకి వెంటనే తెలియ పరిచేందుకు ఓ యాప్ ను తీసుకొస్తామని గతంలోనే జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

ReadAlso : IND vs PAK : ఆసియా కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్థాన్? ఫ్యాన్స్ కి పండగే..

ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కార్యకర్తలకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలను డిజిటల్ బుక్ ద్వారా పార్టీ అధిష్టానానికి తెలియజేయాలని, వెంటనే పార్టీ స్పందించి అండగా ఉంటుందని అన్నారు. అలాగే అధికారంలోకి రాగానే ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించి సంబంధిత అధికారులను, నాయకులను చట్టపరంగా శిక్షిస్తామని తెలిపారు.

Read Also : Krithi Shetty : బ్లాక్ స్కర్ట్ లో అందాలొలికిన కృతీ శెట్టి

మనం అధికారంలో ఉన్నప్పుడు వాలింటీర్లకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని, ఇది కొంత మేర ఉపయోగపడ్డప్పటికి పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు నష్టం చేసిందని అన్నారు. 2029లో అధికారంలోకి రాగానే పార్టీకే అండగా నిలబడుతున్న కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామని, కార్యకర్తలతోనే పాలన జరుపుతామని హామీ ఇచ్చారు.