అక్రమ మద్యం కేసులో వైఎస్సార్‌సీపీ నేత చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి శుక్రవారం (అక్టోబర్ 10) ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. అయితే ఈ విచారణ జరుగుతున్న సమయంలో ఏపీలో మద్యం కుంభకోణం జరిగిందని, ప్రముఖ బ్రాండ్లను తొలగించి కొత్త బ్రాండ్లను తీసుకొచ్చారని ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదించారు. అయితే MSME తరహాలో వాటిని ప్రోత్సహించారామో? అని ఈ సందర్భంగా సుప్రీం ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read : AI : ఏఐ వల్ల త్వరలో మనకు “కరెంట్ షాక్” తగలనుందా?
ఈ కేసు విచారణ సందర్భంగా ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్లకు జస్టిస్ విక్రమ్‌నాథ్ సరదాగా ఓ చురక అంటించారు. ”మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా వాదిస్తున్నారా? మీరు దేశంలోని అందరు మోసగాళ్ల తరఫున వాదనలు వినిపించే న్యాయవాదులు, పెద్ద పెద్ద స్కాంలలో నిందితుల తరఫున వాదనలు వినిపించారు. ఇప్పుడు మీరు బెయిల్‌కు వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తున్నారా? అని జస్టిస్ జడ్జ్ ఫ్రెండ్లీగా అనడంతో కోర్టు హాల్‌లో నవ్వులు పూశాయి.
Also Read : APSRTC : స్త్రీశక్తి పధకంలో బయటపడ్డ అవకతవకలు. ఇది మరొపెద్ద స్కామ్ అంటూ ఆరోపణలు
ఇదిలా ఉంటే ఈ కేసులో ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా, సిద్దార్థ్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. ఈ ముగ్గురిలో ముకుల్ రోహత్గీ, సిద్ధార్థ్ లూథ్రాలు గతంలో ఎన్నో హైప్రొఫైల్ కేసుల్లో బెయిల్ కోసం వాదనలు వినిపించారు. ఇందులో గుజరాత్ అల్లర్ల కేసు, అమిత్ షా తరుపున జస్టిస్ లోయా కేసు, ఆశారాం బాపు కేసు, కోల్‌స్కాం కేసు, 2జీ కుంభకోణం కేసు, నోట్ల కట్టలతో దొరికిన జస్టిస్ వర్మ కేసులు ఉన్నాయి. వీటితో పాటు చంద్రబాబు నాయుడు నిందితుడిగా ఉన్న ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులోనూ బెయిల్ కోసం వీరే వాదనలు వినిపించారు.
