ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం ఒక పార్టీ నుండి ఇంకొక పార్టీకి మారగానే పార్టీ ఫిరాయింపులు సైతం ఎక్కువవుతూ ఉంటాయి. 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎంమ్యల్సీలను, తర్వాత 21 మంది ఎంమ్యల్యేలను తమ పార్టీలో జేర్చుకున్న విషయం తెలిసిందే.
Read Also : ఈరోజు వైసీపీ “చలో మెడికల్ కాలేజ్” కార్యక్రమం. ఏం జరగబోతోంది?
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక, ఎవరైనా తన పార్టీలోకి రావాలనుకుంటే రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడంతో ఎక్కువ చేరికలు జరగలేదు. వల్లభనేని వంశీ వంటివారు పార్టీలో చేరకుండానే చివరివరకు వైసీపీకి మద్దతుగా కొనసాగారు. ఇక ఇప్పుడు మళ్లీ అధికారంలోకి వచ్చాక టీడీపీలోకి తిరిగి వలసలు ప్రారంభమయ్యాయి.
Read Also : Andhra Pradesh : ఏపీలో బీచ్ ఫెస్టివల్. ఎక్కడో తెలుసా?
ఈరోజు (19/09/2025) సాయంత్రం ఓ ముగ్గురు వైసీపీ ఎంమ్యల్సీలు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది. మర్రి రాజశేఖరం, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రీ పద్మశ్రీ పార్టీ మారుతున్న వారిలో ఉన్నారని సమాచారం. వీరు ఇంతకు మునుపే ఎమ్యల్సీ పదవులకు, వైసీపీ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కానీ వారి రాజీనామాపై మండలి చైర్మన్ ఇప్పటివరకూ ఏ నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.
