ఈరోజు వైసీపీ “చలో మెడికల్ కాలేజ్” కార్యక్రమం. ఏం జరగబోతోంది?

ఆంద్రప్రదేశ్ లో మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశం కాక రేపుతోంది. మా హయాంలో 17 మెడికల్ కాలేజీలను సాధించి చాలా వరకు పనులు పూర్తి చేశామని, 4 కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, మరో 5 కాలేజీలకు ఈ సంవత్సరం నుండీ అడ్మిషన్లు జరగడానికి అంత సిద్ధంగా ఉందని చెప్తోంది వైసీపీ. అలాగే పులివెదులతో సహా అనేక మెడికల్ కళాశాలకు కేంద్ర ప్రభత్వం సీట్లు కూడా కేటాయిస్తే వద్దని తిప్పి పంపిచేసారని, ఇది కేవలం ప్రభుత్వ సొంత డబ్బుతో ఏర్పాటు చేసిన వసతులతో కూడిన కాలేజీలను చంద్రబాబు తన అనుయాయులకు కట్టు బెట్టేందుకే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.

Read Also : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. క్రోమాలో అద్భుతమైన ఆఫర్లు

మరోవైపు టీడీపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతోంది. పీపీపీ విధానమే ఈ మెడికల్ కళాశాలల నిర్వాహణకు సరైన పద్ధతని, ప్రభుత్వ ప్రయివేట్ భాగస్వామ్యం ద్వారా ప్రభుత్వంపై నిర్వహణ భారం తగ్గుతుందని చెబుతోంది. ఇది ఇలా ఉంటే సాధారణ మెడికల్ విద్యార్థుల భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఎన్ని సాకులు చెప్పినా ప్రయివేట్ భాగస్వామ్యంతో నడిచే కాలేజీల్లో ప్రభుత్వ కళాశాలల ఫీజులు ఉండవని, ఇది విద్యార్థులపై మోయలేని భారాన్ని వేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Read Also : Andhra Pradesh : ఏపీలో బీచ్ ఫెస్టివల్. ఎక్కడో తెలుసా?

ఈ నేపథ్యంలో ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తున్న వైసీపీ ఈ అంశాన్ని ప్రధాన అజెండాగా మార్చుకుంది. ఒక పక్క రాష్ట్రంలో అసెంబ్లీ కార్యకలాపాలు జరుగుతున్న ఈ సమయంలో, ఈరోజు పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నేతృత్వంలో “చలో మెడికల్ కాలేజ్” కార్యక్రమానికి పిలుపునిచ్చింది వైసీపీ. మిగిలిన అనుబంధ విభాగాల నేతలతో పాటు పార్టీ కార్యకర్తలు సైతం ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పాల్గొనాలని జగన్ సూచించారు. మరి జగన్ ఈ కార్యక్రమంలో ఎక్కడన్నా పాల్గొంటారా లేదా అనే దానిమీద స్పష్టత రావాల్సిఉంది.