ఈరోజు నుండీ ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ ప్రపంచం కప్. భారత్ షడ్యూల్ ఇదే! లైవ్ ఎక్కడంటే?

ఈరోజు (సెప్టెంబర్ 30) నుండీ మహిళల వన్డే ప్రపంచ కప్ మొదలుకానుంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియాతో కలిపి మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ 8 జట్లు గ్రూప్ స్టేజ్‌లో రౌండ్ రాబిన్ పద్దతిలో పోటీ పడనున్నాయి, అంటే ప్రతి జట్టు మిగిలిన 7 జట్లతో మొత్తం 7 మ్యాచులు ఆడనుంది. అందులో టాప్ 4 లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌ లో తలపడతాయి. ఇండియా, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ వరల్డ్ కప్  ఫైనల్  నవెంబర్ 2న కొలంబోలో జరగనుంది.

Read Also : తెలంగాణ స్థానిక సమరం జరిగేనా? 9వ షడ్యూలే కీలకమా?

ఇక ఈరోజు ఇండియా శ్రీలంక మధ్య గోహతీలో జరగనున్న మ్యాచ్ తో టోర్నమెంట్ ప్రారంభం కానుంది. హోమ్‌గ్రౌండ్‌‎ లలో ఆడనుండడం ఇండియాకు అతి పెద్ద ప్లేస్ పాయింట్. ఇటీవలే ఇంగ్లండ్‌‎పై వన్డే, టీ20 సిరీస్‌ లను గెలవడం, బలమైన ఆస్ట్రేలియాతో జరిగిన 3 మ్యాచుల వన్డే సిరీస్‌‎ లో గట్టి పోటీ ఇవ్వడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.

Read Also : విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ఎవరికి నష్టం?

ఈ ఏడాది నాలుగు వన్డే సెంచరీలు కొట్టిన వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తన కెరీర్‌ బెస్ట్‌ఫామ్‌లో ఉంది. ఆమెకు యంగ్ ఓపెనర్ ప్రతీక రావల్ మంచి సపోర్ట్ ఇస్తోంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పెద్ద టోర్నీల్లో చెలరేగి ఆడగలదు. జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్‌‎లో రిచా ఘోష్, హర్లీన్ డియోల్, ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మతో ఇండియన్ బ్యాటింగ్ పవర్ఫుల్ గా ఉంది. బాలింగ్ లో చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ టీమ్ బ్యాలెన్స్ బాగుంది. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్‌‎ల్లో ఒత్తిడికి గురై ఓడిపోవడం మన టీమ్ కి ఉన్న అతిపెద్ద వీక్‌నెస్. 2005, 2017 వన్డే వరల్డ్ కప్, 2020 టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్స్‌‏తో పాటు 2022 కామన్వెల్త్ గేమ్స్ లో ఆఖరి సమరంలో తడబడడం దీనికి నిదర్శనం. ఈ ఒక్క బలహీనతను అధిగమిస్తే ఈసారి ప్రపంచ విజేతలుగా నిలవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. All the best Team India

Read Also : Bhagyasri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ లుక్

వరల్డ్ కప్ లో భారత్ షడ్యూల్ :

సెప్టెంబర్ 30 : ఇండియా vs శ్రీలంక

అక్టోబర్ 5 : ఇండియా vs పాకిస్థాన్

అక్టోబర్ 9 : ఇండియా vs సౌత్ ఆఫ్రికా

అక్టోబర్ 12 : ఇండియా vs ఆస్ట్రేలియా

అక్టోబర్ 19 : ఇండియా vs ఇంగ్లాండ్

అక్టోబర్ 23 : ఇండియా vs న్యూజిల్యాండ్

అక్టోబర్ 26 : ఇండియా vs బాంగ్లాదేశ్

 

అక్టోబర్ 29 : సెమీఫైనల్ 1

అక్టోబర్ 30 : సెమీఫైనల్ 2

నవెంబర్ 2 : ఫైనల్

మ్యాచులన్నీ మధ్యాన్నం 3 గంటలనుండీ ప్రారంభం అవుతాయి. స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ & జియో హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ చూడచ్చు.