ఎప్పటినించో జనాభాలో సింహభాగం కలిగిన మాకు రాజ్యాధికారం కావాలని బిసిలు పోరాటం చేస్తూనే ఉన్నారు. అనేక సందర్భాల్లో బీసీలకు రాజ్యాధికారం కల్పిస్తామని మభ్యపెట్టే ప్రయత్నాలు అన్ని పార్టీలు చేసాయి. కానీ అవి ఓటు బ్యాంకు రాజకీయాలుగానే మిగిలిపోయాయి తప్ప ఏవీ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు తాజాగా తెలంగాలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 42 శాతం రాజకీయ రిజర్వేషంలంటూ తెచ్చిన బిల్ తో మళ్ళీ ఈ వర్గానికి ఆశలు చిగురించాయి. కానీ మళ్ళీ కధ మామూలే. రాజ్యమేలుతారనుకుంటే మళ్ళీ రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది.
Also : Read : Ananya Sharma : అనన్య ఫోటో గ్యాలరీ
ఈ పరియొవసాననికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ మొత్తం ఉదంతానికి సూత్రధారి కాంగ్రెస్ అయితే పాత్రధారులు బీజేపీ, కోర్టులు. అనాలోచితంగా న్యాయ సలహాలు తీసుకోకుండా, టెక్నికల్ సమస్యలకు పరిష్కారాలు వేతక్కుండా బిల్లు తీసుకురావడం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొదటి తప్పు అని చెప్పవచ్చు. ఈ బిల్లు తేవాలనే ఉద్దేశ్యం ముఖ్యమంత్రికి ముందే ఉన్నప్పుడు, బాగా అలెస్యమయ్యి, కోర్టు ఎన్నికలు పెట్టేందుకు డెడ్ లైన్ విధించే వరకూ దీనిపై కసరత్తు జరగకపోవడం శోచనీయం. ఇక ఎన్నికలకు కోర్టు సెప్టెంబర్ 30 వరకు డెడ్ లైన్ విధించడంతో ఆఘమేఘాలమీద ఈ బిల్ కు తుందిరూపం ఇవ్వాల్సిరావడం, ఆ బిల్ తాలూకు శక్తి, సాంకేతిక అంశాలపై ప్రభావం చూపింది.
Also Read : Pranita Subhash : పాలరాతి శిల్పం ప్రణీత సుభాష్
ఇక ఇక్కడే బీజేపీ పాత్రధారిగా రంగం లోకి ప్రేవేశించింది. గవర్నర్ దగ్గర ఈ బిల్ పెండింగ్ లో ఉండిపోవడం, బీసీల పాలిటి దైవంగా కాంగ్రెస్ ను మారనీయకూడదన్న తపన వల్లే ఆ బిల్లుకు మోక్షం లభించలేదనేది పలువురి అభిప్రాయం. నిజాయితీగా ఆ బిల్లుపై అన్ని విభాగాల్లో చర్చ జరిగి ఉంటే సమస్య ఇంత జఠిలమైతే అయ్యేది కాదు. ఇప్పుడు అటు సమయం పరంగా, ఇటు సాంకేతికంగా బిల్లు హోల్డులో పడటం ఈ ఆలస్యం తాలూకు ఔట్ ఫుట్ అని చెప్పడంలో పెద్దగా ఆలొచ్చించాల్సిన అవసరం లేదు.
Also Read : రన్నింగ్ ట్రైన్ లో మహిళపై అత్యాచారం. ఎక్కడో తెలిస్తే షాక్ అవుతారు…
ఇక కోర్టులో జరిగిన పరిణామాలు సాధారణ ప్రజల్ని ఒకింత ఆశ్చర్యానికి, అసహనానికి గురిచేసాయన్నది కాదనలేని వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో కోర్టు తీర్పులు సాధారణంగా ఒక సొల్యూషన్ ని చూపించాలని ప్రజలు భావిస్తారు. వాస్తవానికి అదే న్యాయం కూడా. ఒకవేళ బిల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని భావిస్తే ఇటు హైకోర్టు అయిన , అటు సుప్రీం అయిన ఈ బిల్లుని రడ్ఫు చేసి, సమగ్రమైన బిల్లును ప్రేవేశపెట్టమని, ఎన్నికలు పాత రిజర్వేషన్ల ప్రకారం జరపమని చెప్పవచ్చు. ఆ తర్వాత సమగ్ర బిల్ రూపొందించే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత అయినా సమస్య పరిష్కారం అవుతుంది. లేదా ఆ బిల్లు చట్టంగా మారాలంటే ఏమేమి జరగలనేదానిపై విధి విధానాలు ఇవ్వొచ్చు. అదీ జరగలేదు. ఏమాత్రం క్లారిటీ లేని జాప్యం మాత్రమే కోర్టులలోనూ జరుగుతోంది.
దీంతో ఇప్పుడు అటు బిల్ విషయంలోనూ, ఇటు ఎన్నికల విషయంలోనూ సందిగ్ధతే నెలకొంది. దాంతో మళ్ళీ బీసీలకు రోడ్డెక్కక తప్పని పరిస్థితి ఏర్పడింది.
