రెండవ సారి అమెరికాకి ప్రెసిడెంట్ అయిన తర్వాత కొంత అగ్రేసిప్ గా, కొంత వెర్రితనంగా ప్రవర్తిస్తున్నాడు డోనాల్డ్ ట్రంప్. ఈ మధ్య ప్రపంచంలో కొనసాగుతున్న అనేక యుద్ధాలలో ఎవరూ పిలవకపోయినా దూరేస్తున్నాడాయన. అంతే కాకుండా అన్నీ తానై ప్రకటనలూ చేసేస్తున్నాడు. యుద్ధాలు ఆపేసింది నేనేనని పదే పదే చెపుకుంటున్నాడు. ఈ కారణాలతో తనకు నోబుల్ శాంతి బహుమతి రావాలని మనసులో మాట అనేకసాఫ్లు బయటపెట్టిన విషయం కూడా మనకు తెలిసిందే.
Read Also : ఓ వ్యక్తి దగ్గర 1638 క్రెడిట్ కార్డులు ఉన్నాయంటే నమ్ముతారా? గిన్నీస్ రికార్డ్ సాధించిన భారతీయుడు..
అంతటితో ఆగని ట్రంప్ తనకు వత్తాసు పలికే దేశాలతో నోబుల్ ప్రైజ్ తనకే ఇవ్వాలని కమిటీకి సిఫార్సులు కూడా చేయించుకుంటున్నాడు. పాకిస్థాన్ అధ్యక్షుడు షాబా షరీఫ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్స్కీ ఈ మధ్యనే ఇండో పాక్, రష్యా ఉక్రెయిన్ యుద్ధాలు ఆపినందుకు ట్రంప్ కు నోబుల్ శాంతి పురస్కారం ఇవ్వాలని బహిరంగంగానే ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే.
Read Also : ARATTAI : అరట్టై సెన్సేషన్.. వాట్సాప్ కు చుక్కలు చూపిస్తున్న న్యూ ఇండియన్ యాప్
ఇక అసలు విషయానికొస్తే ఒక్క ఇండో పాక్ యుద్ధం తప్ప మరే యుద్ధమూ అగలేదన్నది వాస్తవం. అవి రావణ కాష్టంలా అలా జరుగుతూనే ఉన్నాయి. సరే అదలా ఉంచితే ఇప్పుడు అసలైన తరుణం రానే వచ్చింది. మరో రెండు రోజుల్లో అంటే అక్టోబర్ 10న నోబుల్ కమిటీ పురస్కార గ్రహీతలను ప్రకటించనుంది. చిన్న పిల్లోడు ఛాక్లేట్ కోసం ఏడ్చినట్టు, ఎక్కడ అవకాశం దొరికినా నోబుల్ అని ఏడుస్తున్న ట్రంప్ కు ఈ రెండు రోజులు ఇక నిద్ర పట్టదేమో. డబ్బు అధికారం ఉన్న ట్రంప్ ఏమైనా చెయ్యొచ్చు. కానీ నోబుల్ కమిటీ సైతం ఇలాంటి చీప్ ట్రిక్స్ కు లోంగే టైప్ కాదు. ఒకవేళ ఈ సారి నోబుల్ బహుతి ట్రంప్ కి దక్కకపోతే ఏమైపోతాడో ఏమో పాపం!
