నటుడు విజయ్ దేవరకొండ నటి రష్మీక మదన్నా కొన్నాళ్లనుండీ ప్రేమలో ఉన్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వీరు ఇరువురూ ఎక్కడా అధికారికంగా ఈ విషయాన్ని దృవీకరించలేదు. కానీ వారు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోల ద్వారానో, లేదా ఎయిర్పోర్ట్ లో ఒకేసారి కనిపిస్తూ విలేకర్లకు చాలాసార్లు దొరికిపోవడం వల్లనో ఆ రూమర్లకు ఎప్పటికప్పుడు బలం చేకూరుతూనే వచ్చింది. ఇక మొన్న విజయ్ లేటెస్ట్ చిత్రం కిగ్ డమ్ సక్సెస్ అయినప్పుడు “మనం కొట్టినం” అని రష్మీక చేసిన పోస్ట్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.
Also Read : Vijaya Dasami : విజయ దశమికి, జమ్మి చెట్టుకు సంబంధం ఏమిటి?
ఇక వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని చాలా సార్లు వార్తలు వచ్చాయి. కానీ ఈ సారి మాత్రం ఆ మాటలను నిజం చేస్తూ శుక్రవారం (3-10-2025) హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ స్వగృహంలో అత్యంత సన్నిహితుల మధ్య వీరి నిశ్చితార్థం జరిగింది. వచ్చే సంవత్సరం ఫిబ్రవరీలో వీరు పెళ్లి పీటలెక్కనున్నారని సమాచారం. మొత్తానికి మన రౌడీబాయ్ విజయ్ దేవరకొండ ఓ ఇంటివాడు అవుతున్నాడు అన్నమాట!
