అనిల్ రావిపూడి డైరెక్షన్లో, మెగాస్టార్ చిరంజీవి, నయనతార కాంబినేషన్ లో, సుస్మిత కొణిదెల, సాహు గార్లఓటి నిర్మాతలుగా ఓ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈమధ్యనే ఈ సినిమాకు ‘మన శంకర వరప్రసాద్’ అనే టైటిల్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు చిత్ర బృందం. బీమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రమోషన్స్ ను ఎప్పటిలాగానే చాలా వెరైటీగా ప్లాన్ చేశారు అనిల్.
Read Also : తెలంగాణ స్థానిక సమరం జరిగేనా? 9వ షడ్యూలే కీలకమా?
ఇక టైటిల్ వచ్చాక ఈ చిత్రంమీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసాక ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం చూస్తున్న ఆయన అభిమానులకు ఈ సినిమా కావాల్సిన కిక్ ఇచ్చేటట్లే కనబడుతోంది. అనిల్ డైలాగ్స్, చిరు కామెడీ టైమింగ్ వెరసి థియేటర్లలో నవ్వుల వర్షం కురవడం ఖాయమని అభిమానులు అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో వెంకటేష్ కూడా నటిస్తుండడంతో తెరపై చిరు వెంకటేష్ లను ఒకే సారి చూసే క్షణం కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఇవ్వాళ్ళ ఈ సినిమా నుండి ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుండీ నయనతార లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆమె క్యారెక్టర్ పేరు శశిరేఖ. పోస్టర్లో పచ్చని చీర కట్టులో చూడచక్కగా ఉంది నయన్. ఇక రేపు మరో అద్భుతమైన అప్డేట్ తో వస్తామని ప్రకటించారు అనిల్. దీనితో ఒక్కసారిగా ఫ్యాన్స్ ఆ అప్డేట్ ఏమిటా అని లెక్కలేసుకుంటున్నారు. ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 2026లో విడుదల కానుంది.
Read Also : Bhagyasri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ లుక్
