రెండోసారి ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో కొన్ని ఇండియాకి డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేస్తుంటే మరికొన్ని పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నాయి.
Read Also : ప్రభుత్వ వాట్సాప్ గ్రూపులనుండీ వైదొలుగుతున్న సచివాలయ ఉద్యోగులు
ఈ మాంద్యనే ఫార్మా ఉత్పత్తులపై ట్రంప్ 100% టారిఫ్ విధించిన విషయం తెలిసిందే. దానితో భారత ఫార్మా కంపెనీలకు 12% వాటా కలిగియున్న యుఎస్ మార్కెట్ పై ప్రభావం పడింది. కానీ అమెరికాలో వాడే అనేక జెనరిక్ మందులు భారతం దేశం నుండే యూఎస్ కు ఎగుమతి అవుతాయి. దీనితో అటు యూఎస్ లోనూయి విషయంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Read Also : Ram Charan : పెద్ది మూవీ నుండీ స్పెషల్ పోస్టర్ విడుదల. కారణం ఏమిటో తెలుసా?
ఇక ఇప్పుడు ట్రంప్ మరో అడుగు ముందుకేసి విదేశీ సినిమాపై 100% టారిఫ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో ఇండియాతో పాటు ఇతర దేశాల సినిమాలు అమెరికాలో రిలీజ్ అవ్వాలంటే 100 పన్ను కట్టాల్సిందే. ఇది రానున్న హైబడ్జెట్ టాలీవుడ్ సినిమాలపై కూడా భారీ ప్రభావం చూపనుంది. అమెరికా చిత్రాలకు అమెరికాలో ఉన్నత స్థానం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ చెవుతున్నారు. ఇతర దేశాల సినిమాలో యూఎస్ లో రిలీజ్ చేసి హిట్ చేయడమంటే చిన్నపిల్లల నుండీ క్యాండీ లాక్కోవడమే అని ఆయన వ్యాఖ్యానించడం హాలీవుడ్ ప్రస్తుత పరిస్థితిని చెప్తోంది.
Read Also :కరూర్ దుర్ఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? తప్పు విజయ్ దేనా? లేక ప్రభుత్వానిదా?
ఇక ఇండియాకు సంబందించిన పెద్ద సినిమాలకు తప్ప చిన్న బ్యానర్ల సినిమాలను అక్కడి డిస్ట్రిబ్యూటర్లు లైట్ తీసుకోవచ్చు. కానీ సరిగ్గా ఆలోచిస్తే ఇది యూఎస్ కే ఘాతంగా పరిగణించచ్చు. క్వాలిటీ పేరుతో యూఎస్ లో తీసే సినిమాలు చాలా లెట్ అవుతూ ఉంటాయి. అలాగే అవి బిలియన్ డాలర్ల బడ్జెట్ తో రూపొందుతుంటాయ్.ఈ నేపథ్యంలో విదేశీ సినిమాలే అక్కడి డిస్ట్రిబ్యూటర్లను, ఎగ్జిబిటర్లను అదుకుంటుంటాయి. ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అలాంటి డిస్ట్రిబ్యూటర్లపై భారీ దెబ్బ పడే అవకాశం ఉంది. మరి దీనిపై అక్కడి డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎలా స్పందిస్తాయి చూడాలి.
