New Party in Telangana : తెలంగాణలో కొత్త పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న

తెలంగాణలో మరో కొత్త పార్టీ పురుడు పోసుకుంది. రాజకీయ చైతన్యం మెండుగా ఉన్న తెలంగాణలో కొత్త పార్టీలు ఎన్నో పుట్టాయి. తర్వాత కొన్నాళ్ళకు చాలా పార్టీలు కాల గర్భంలో కలిసిపోయాయి. దేవేందర్ గౌడ్ నుండి విజయశాంతి వరకు, రేణుక చౌదరి నుండి మొన్నటి వైయస్ షర్మిల వరకు అనేకమంది తెలంగాణ రాజకీయాల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.

Read Also : మావోయిస్టుల సంచలన ప్రకటన. భారత హోమ్ శాఖకు లేఖ

కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాంగ్రెస్, బీ ఆర్ యస్ పోటాపోటీగా తలబడుతుంటే మరోవైపు బీజేపీ తెలంగాణలో ఎదిగేందుకు పూర్తిస్థాయి నిబద్దతతో పోరాడుతోంది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్నగా పాపులర్ అయిన ఎమ్యల్సి చింతపండు నవీన్ “తెలంగాణ రాజ్యాధికార పార్టీ” (TRP) పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు.

Read Also : Official : మన హీరోయిన్ల రెమ్యునరేషన్లు చూస్తే షాక్ అవుతారు

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో కొద్దిమంది సమక్షంలో జరిగిన వేడుకలో తన పార్టీని, జండాను ఆవిష్కరించారు మల్లన్న, అనంతరం మాట్లాడుతూ, అధికారానికి నోచుకోని బడుగు వర్గాలకు రాజ్యాధికారమే తమ ఎజెండా అని అన్నారు. ఆత్మ గౌరవం, అధికారంలో వాటా అనే నినాదాలతో మా పార్టీ పనిచేస్తుందని, రాబోయే అన్ని ఎన్నికల్లో TRP పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.