T సుబ్బిరామిరెడ్డి కంపెనీకి రూ. 5700 కోట్ల లోన్ మాఫీ.. ఇలా కూడా చెయ్యొచ్చా?

ప్రముఖ పారిశ్రామిక వేత్త T. సుబ్బిరామి రెడ్డి కంపెనీ గాయత్రి ప్రాజెక్ట్స్ కు రూ. 5700 కోట్ల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తూ జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ నిర్ణయం తీసుకుంది. ఆయన కంపెనీ దివాలా తీయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

Read Also : టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ ఎంమ్యల్సీలు

గతంలో సుబ్బిరామి రెడ్డి నేతృత్వంలోని గాయత్రి ప్రాజెక్ట్స్ కు కెనరా బ్యాంక్ రూ. 8100 కోట్ల ఋణాన్ని మంజూరు చేసింది. తర్వాత ఆ కంపెనీ నష్టాల్లోకి వెళ్లడంతో, కంపెనీ ఆ రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయింది. ఇక చేసేదేమీ లేక 2022లో ఆ కంపెనీ NCLTలో దివాలా పిటీషన్ దాఖలు చేసింది. దానితో లోన్ రికవరీకోసం NCLT కంపెనీ వేలానికి నిర్ణయం తీసుకుంది.

Read Also : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. క్రోమాలో అద్భుతమైన ఆఫర్లు

కానీ గాయత్రి ప్రాజెక్ట్స్ ను కొనడానికి ఏ కంపెనీ ముందుకు రాలేదు. దానితో సుబ్బిరామి రెడ్డి ఫ్యామిలీనే ఆ కంపెనీని తిరిగి కొనుగోలు చేయడానికి ముందుకొచ్చింది. అందుకుగానూ రూ. 2400 కోట్లు వన్ టైమ్ సెటిల్మెంట్ కింద కట్టడానికి సిద్ధమైంది. దానితో మిగిలిన రూ.5700 కోట్ల రుణాన్ని మాఫీ చేస్తూ NCLT నిర్ణయం తీసుకుంది. మొత్తానికి ఆయన కంపెనీ ఆయానవద్దనే ఉండి రూ. 5700 కోట్ల రుణం మాఫీ అవడం పట్ల పలువురు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.