IND vs PAK : రైవలరీ ఎక్కడుంది. ఇజ్జత్ తీసుకోకండి : కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్ట్రాంగ్ రిప్లే

ప్రస్తుతం ఆసియా కప్ 2025 మంచి ఊపు మీదుంది. టీమిండియా ఇప్పటివరకు టోర్నమెంట్‌లో అజేయంగా ఉంది అంటే భారత జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. భారత ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉన్నారు. గ్రూప్ దశలో పాకిస్తాన్ ను మట్టి కరిపించిన భారత్ సూపర్-4లో కూడా పాక్ ను చావుదెబ్బ కొట్టింది. దీంతో పాకిస్తాన్ అహంకారానికి సరైన గుణపాఠం చెప్పింది భారత్.

Read Also : మళ్ళీ ఉత్తరాది – దక్షిణాది విభేదాల్ని రాజేసిన జీయస్టీ వ్యవహారం

ఈ సూపర్-4 మ్యాచ్‌లో పాక్ జట్టుపై భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పాకిస్తాన్ భారత్‌కు 172 పరుగుల లక్షాన్ని ఇవ్వగా టీమిండియా 18.5 ఓవర్లలోనే ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఇక భారత్ విజయం సాధించిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పోస్ట్ మ్యాచ్ ప్రెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

Read Also : రేపటి నుండి ప్రారంభం కానున్న దసరా నవరాత్రులు. బెజవాడ కనకదుర్గ 11 రోజులు 11 అవతారాలు

ఓ జర్నలిస్ట్ పాకిస్థాన్, ఇండియా క్రికెట్ రైవలరీ గురించి అడగగా సూర్య కుమార్ ఘాటుగా స్పందించారు. “రైవలరీ గురించి ఇక మీదట మాట్లాడకండి. ఒక 15 మ్యాచులు జరిగితే, అందులో 7-7 గానో, 7-8 గానో ఇరు జట్లు మ్యాచులు గెలుస్తుంటే రైవలరీ అంటారు. నాకు స్టాట్స్ గుర్తులేవుగానీ 13-0 నో 10-1 నో గెలిస్తే అది వైవలరీ ఎలా అవుతుంది? ఇండియా పాక్ మధ్య రైవలరీ లేదు” అటూ పాకిస్థాన్ ఇజ్జత్ ను తీసి పడేసాడు. వాస్తవంగా చూసినా, ప్లేయర్లను తిట్టడం, గన్ పేల్చినట్టు, రఫెల్ కూల్చినట్లు సజ్ఞలు చేయడం తప్ప పాకిస్థాన్ పీకిందేమీ లేదు. కనీసం నోరు, కాళ్ళు, చేతులన్నా కంట్రోల్ లో పెట్టుకుంటే ఇజ్జత్ అయిన కాపాడుకోవచ్చు