రెండు రాష్ట్రాలు.. ఇద్దరు ముఖ్యమంత్రులు.. 3 పార్టీలు.. ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో ఒకప్పుడు సంచలనం రేపిన కేసిది. ఇప్పుడు తాజా రాజకీయాల్లో చక్రం తిప్పబోతోందా అంటే అవుననే సంకేతాలే వస్తున్నాయి. ఈరోజు సుప్రీం కోర్టు ఈ కేసు మీద తన తదుపరి తీర్పు ఇవ్వనుంది. వివరాల్లోకి వెళ్తే జరుసలేం మత్తయ్యను ఈ కేసునుండీ తప్పిస్తూ అప్పట్లో తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. మారిన పరిస్థితుల్లో ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీ తలుపు తట్టింది రేవంత్ నేతృత్వంలోని తెలంగాణ సర్కార్.
Read Also : ట్రంప్ సంచలన ప్రకటన. భారత కంపెనీలకు నష్టం తప్పదా?
ఈ ఓటుకు నోటు వ్యవహారానికి సూత్రధారి జేరుసెలెం మత్తయ్యేనని ప్రభుత్వం వాదిస్తోంది. ఇదిలా ఉంటె అసలు ఈ వ్యవహారం మొత్తానికి అప్పటి, ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని, ఆయన కనుసన్నల్లోనే జరిగిందని అందుకే ఆ కోణంలో దర్యాప్తు చెయ్యాలని జేరుసలెం మత్తయ్య సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. దీనితో ఇప్పుడు సుప్రీం ఇవ్వబోయే తీర్పుకు ప్రాధాన్యత సంతరించుకుంది.
ReadAlso : Rohit Sharma : 10కేజీలు తగ్గిన హిట్ మ్యాన్! వరల్డ్ కప్ కు ఫిక్స్ చేసాకే..?
ఒక వేళ జరుసేలం పాత్రను మళ్ళీ కేసులోకి తీసుకుంటే తదుపరి విచారణలో ఏమ్ జరగబోతోందనేది ఇంట్రస్టింగ్ గా మారింది. అప్పుడు తర్వాతి విచారణలో ఎవరెవరి పేర్లు బయటకొస్తాయో అనే ఆసక్తి నెలకొంది. లేక డైరెక్ట్ గా దొరికిన ఆధారాలతో ఏపీ సీఎం చంద్ర బాబునే కోర్టు విచారణ పరిధిలోకి తీసుకొస్తే, ఇక తర్వాత రెండు రాష్ట్రాల్లో రాజకీయం మరింత వేడెక్కనుంది. మొత్తం మీద ఈ రోజు సుప్రీం ఇవ్వబోయే తీర్పు ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలకు దారుతీస్తుందనే వాదన వినిపిస్తోంది.
