కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్. ఇంకా ఆస్ట్రేలియాలోనే..

 

ఆస్ట్రేలియా ఇండియా మధ్య సిడ్నీలో జరిగిన మూడవ వన్డేలో క్యాచ్ పడుతూ గాయపడ్డ భారత స్టార్ బ్యాట్సమెన్ శ్రేయాస్ అయ్యర్ కోలుకుంటున్నారు. ఆ మ్యాచ్ లో హర్షిత్ రానా వేసిన బంతిని కెరీ షాట్ కొట్టగా శ్రేయాస్ వెనకకు పరిగెత్తుతూ అద్భుత క్యాచ్ అందుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో కిందపడి రిబ్స్ నేలకు బలంగా గుద్దుకోవడంతో లోపల ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యింది. దీనితో సిడ్నీలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్లో చేర్చారు. ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

Also Read : ఈ రోజే నాగుల చవితి. నాగపూజకు సరైన సమయం ఎదో తెలుసా?

ఈ నేపథ్యంలో అభిమానులు ఆందోళన చెందుతున్న వేళ బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది. శ్రేయాస్ త్వరగా కొలుకుంటున్నారని, ఈ రోజు ఐసీయు నుండీ సాధారణ రూమ్ కు మార్చారని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీసీఐ టీమ్ డాక్టర్ ఎప్పుడూ శ్రేయాస్ తోనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆస్ట్రేలియా నుండీ త్వరలోనే స్వదేశానికి వస్తారని, తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో రిహబ్ అవుతారని చెప్పారు.

Also read : MANTHA CYCLONE : దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్. ఏపీని ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు

ఇదిలా ఉంటే నవంబర్ చివరి వారంలో జరగనున్న సౌత్ ఆఫ్రికా వన్డే సిరీస్ కు శ్రేయాస్ అందుబాటులో ఉంటారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. టెస్ట్ క్రికెట్ కు తనంతట తనుగానే దూరమై ఉన్నందున కొలుకోవడానికి ఒక నెల కంటే ఎక్కువ సమయం దొరకడంతో శ్రేయాస్ త్వరగా కొలుకుని SA సీరీస్ కు అందుబాటులోకి వస్తారని  అంటున్నారు. ఏదేమైనా 2027 లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు చాలా కీలకంగా ఉండనున్న శ్రేయాస్ అయ్యర్ త్వరగా కోలుకుని ఫిట్నెస్ సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు.