గత పప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుండీ గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోందనే చెప్పాలి. వలింటీర్ వ్యవస్థను పూర్తిగా పక్క పెట్టిన చంద్రబాబు సర్కార్, అప్పటికే జగన్ ప్రభుత్వం పర్మినెంట్ చేసిన సచివాలయ ఉద్యోగులను మాత్రం వివిద శాఖలకు తరలించింది.
ఇదీ చదవండి : Bhagyasri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ లుక్
ఇక వాలిటీర్లు లేకపోవడంతో పెన్షన్ సహా అనేక డోర్ డెలివరీ కార్యకలాపాల బాధ్యత సచివాలయ ఉంద్యోగులపైనే పడింది. దీనితో ఇప్పటికే కొంత అసంతృతప్తితో ఉన్న ఉద్యోగులకు, ప్రభుత్వం రీసెంట్ గా మరో షాక్ ఇచ్చింది. P4, జీఎస్టీ, వాట్సాప్ గవర్నెన్స్ పై డోర్ టూ డోర్ క్యాంపెయిన్ చెయ్యాలని సచివాలయ ఉద్యోగులను ఆదేశించింది.
ఇదీ చదవండి : Ram Charan : పెద్ది మూవీ నుండీ స్పెషల్ పోస్టర్ విడుదల. కారణం ఏమిటో తెలుసా?
ఆ ఆదేశాలను ఉద్యోగులు కొంతవరకూ లైట్ తీసుకోవడంతో వారిపై ఒత్తిడి తెస్తోంది ప్రభుత్వం. దీంతో సచివాలయ ఉద్యోగుల జెఏసీ తీవ్రంగా స్పందించింది. ఆత్మగౌరవానికి భంగం కలిగేలా ఇలాంటి పనులకు మమ్మల్ని వాడడం సరైన చర్య కాదని తెలిపింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసిన జెఏసి, ఎన్నోసార్లు మా సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసినా, ప్రభుత్వం కనీసం పట్టించుకోకుండా ఇప్పుడు ఇలా అన్ని పనులకూ మమ్మల్ని బలి పశువులను చెయ్యడం సరైనది కాదని పేర్కొంది. వెంటనే ప్రభుత్వ వాట్సాప్ గ్రూపులనుండీ ఎగ్జిట్ అవ్వాలని తమ సహచరులకు పిలుపునిచ్చింది. దీనితో ఉందయం నుండీ అనేక మంది సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ వాట్సాప్ గ్రూపులనుంది వైదొలుగుతున్నారు.
