India Squad : రోహిత్, కోహ్లీ పునరాగమనానికి రంగం సిద్ధం

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఈ రెండు పేర్లు ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు ఆక్సిజన్ లాంటివి. అటు స్పాన్సర్లకు, బ్రాడ్ క్యాస్టర్లకు కూడా వీళ్లిద్దరూ టీమ్ లో ఉంటే పండగే. మళ్ళీ ఈ రోకో కాంబో చాలా రోజుల తర్వాత స్టేడియంలో సందడి చేయనుంది. ఈనెల (అక్టోబర్) 19 నుండీ ఇండియా ఆసీస్ మధ్య  ఆస్ట్రేలియాలో జరగనున్న 3 మ్యాచుల వన్డే సీరీస్ కు ఈరోజు (04-10-2025) టీమ్ ను ప్రకటించనుంది బీసీసీఐ.

Read Also : BREKING NEWS విజయ్ దేవరకొండ రష్మీక నిశ్చితార్థం

ఈ సీరీస్ లో సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమ్ లోకి రావడం ఖాయం. మార్చ్ లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వీరు మళ్ళీ ఇండియన్ జర్సీలో కనబడలేదు. ఇక రోహిత్ శర్మనే వన్డే సీరీస్ కు కెప్టెన్ గా ఉంటారా లేక గిల్ కి కెప్టెన్సీ ఇస్తారా అన్నది డిస్కషన్ పాయింట్ కానుంది. ఈ విషయాన్ని డైరెక్ట్ గా రోహిత్ తో డిస్కస్ చేసి అతను కెప్టెన్సీ చెయ్యడానికి సిద్ధంగా ఉంటే అతనినే నాయకుడిగా ఉంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిన జట్టే వన్డేలకు కంటిన్యూ చేయనున్నారు. అంటే స్టార్ట్ ప్లేయర్ శ్రీయస్ అయ్యర్ ఎంట్రీ కూడా ఖాయంగా కనిపిస్తోంది. మరి రీసెంట్ సెన్సేషన్ అభిషేక్ శర్మ వన్డే ఎంట్రీ ఇప్పుడే ఉంటుందా ఉండదా అనేది వేచి చూడాలి.

Read Also : BSNL ఈసిమ్ సేవలు ప్రారంభం. సిమ్ లేకుండానే కాల్స్..

ఇక 3 మ్యాచుల వన్డే సీరీస్ తర్వాత ఆస్ట్రేలియాతో 5 మ్యాచుల టీ20 సీరీస్ ఆడనుంది టీమ్ ఇండియా. 2026 మార్చిలో జరిగే టీ20 వరల్డ్ కప్ ప్రిపరేషన్ కు ఈ సీరీస్ కీలకం కానుంది. ఈ సీరీస్ కు కూడా ఈరోజు జట్టును ప్రకటించనుంది బీసీసీఐ. ఆసియా కప్ స్క్వాడ్ లో తృటిలో ప్లేస్ మిస్సయిన శ్రేయాస్ తో పాటు యశస్వీ జైస్వాల్ కి కూడా టీ20 స్క్వాడ్ లో ప్లేస్ రావచ్చు.  అక్టోబర్ 19, 23, 25 తేదీల్లో ఈ 3 వన్డేలు జరగనున్నాయి.