శాఖాహార ప్రోటీన్ ‘పనీర్’ రుచులను ఆస్వాదించండి.. ప్రపంచ శాఖాహార దినోత్సవం ప్రత్యేక కథనం..

అక్టోబర్ 1న ఏటా నిర్వహించే ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా, శాఖాహారులు ఎదర్కొనే ఒక సాధారణ ప్రశ్న—”శాఖాహారులకు ప్రోటీన్ ఎక్కడ నుండి లభిస్తుంది?”—అనేదానికి సమాధానం పనీర్.

Read Also : ఈరోజు నుండీ ప్రారంభం కానున్న మహిళల క్రికెట్ ప్రపంచం కప్. భారత్ షడ్యూల్ ఇదే! లైవ్ ఎక్కడంటే?

పనీర్.. పోషకాల గని : 

పనీర్ అనేది కేవలం రుచికి మాత్రమే కాకుండా, పోషకాల పరంగా కూడా ఒక అద్భుతమైన ఆహారం. అధిక-నాణ్యత గల ప్రోటీన్, కాల్షియం మరియు అనేక ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉండే పనీర్, శరీరం బలం, శక్తి,  ఉల్లాసాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో పనీర్‌ను చేర్చడం వలన పోషకాహార సమతుల్యత దొరకడమే కాక, శాఖాహార భోజనానికి వైవిధ్యాన్ని, అద్భుతమైన రుచిని కూడా జోడిస్తుంది.

Read Also : తెలంగాణ స్థానిక సమరం జరిగేనా? 9వ షడ్యూలే కీలకమా?

ప్రముఖ చెఫ్, విస్మై ఫుడ్స్ యజమాని అయిన చెఫ్ తేజ పారుచూరి పనీర్ విశిష్టతను వివరిస్తూ, “పనీర్ అనేది అనేక వంటకాలలో ఉపయోగించగలిగే ప్రముఖ ఫుడ్ ఐటమ్. ఇది గ్రిల్ చేసినా, stir-fry చేసినా, సలాడ్‌లలో వేసినా, కూరలలో కలిపినా లేదా తీపి వంటకంలో వాడినా అద్భుతంగా ఉంటుంది. వివిధ వంటకాలను, వివిధ రాష్ట్రాల రుచులను పనీర్‌లో మేళవించడం ద్వారా పనీర్‌ను ఎప్పుడూ కొత్తగా, ఉత్తేజకరంగా ఉంచవచ్చు. అదే సమయంలో, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా పొందవచ్చు” అని అన్నారు.

Read Also : విదేశీ సినిమాలపై 100% టారిఫ్ విధిస్తూ ట్రంప్ మరో సంచలన నిర్ణయం. ఎవరికి నష్టం?

ప్రపంచ శాఖాహార దినోత్సవం సందర్భంగా, చెఫ్ తేజ, గోద్రేజ్ జెర్సీ పనీర్ కుక్ బుక్ నుండి ఎంపిక చేసిన పనీర్ వంటకాలను,  వాటి విభిన్న రుచులను ముందుకు తీసుకువస్తున్నారు.

Read Also : Bhagyasri Borse : భాగ్యశ్రీ బోర్సే హాట్ లుక్

ఈ పనీర్ వంటకాల ప్రదర్శన, శాఖాహార వంటకాలు పోషకమైనవి, రుచికరమైనవి అనే విషయాన్ని ప్రతి ఒక్కరికీ మరోసారి గుర్తుచేస్తుంది. కాబట్టి, ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా పనీర్ గొప్ప రుచులను ఆస్వాదించండి.