ముఖ్యమంత్రి చంద్రబాబుతో నవతరంపార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం భేటీ. వైసీపీ డిజిటల్ బుక్ పై ఫిర్యాదు

జగన్ డిజిటల్ బుక్ లో  వైస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజిని పై తొలి ఫిర్యాదు చేసినందుకు జగన్ నన్ను లక్ష్యంగా చేసుకున్నారని, నవతరం పార్టీ నుండి మేము కూటమి ప్రభుత్వం నకు మద్దతుగా ఉన్నందుకు వైస్సార్సీపీ నుండి ట్విట్టర్ ఖాతా ద్వారా నేరుగా బెదిరించారని తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం వినతిపత్రం సమర్పించారు.

Read Also :Nobel Prize : నోబుల్ ప్రైజ్ అనౌన్స్ చేసిన కమిటీ. ఎవరికంటే?

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పొలిటికల్ సెక్రటరీ టిడి జనార్ధన్ రావు సుబ్రహ్మణ్యంని వైస్సార్సీపీ ఏవిదంగా టార్గెట్ చేసిందో ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు. రాష్ట్రంలో అధికారులను కూడా డిజిటల్ బుక్ పేరుతో జగన్  బెదిరిస్తున్నారని, జగన్ మార్క్ అరాచకాన్ని వైస్సార్సీపీ నేతలు కూడా ఇంకా ఫాలో అవుతున్నారని సుబ్రమణ్యం అన్నారు. డిజిటల్ బుక్ లో వస్తున్న ఫిర్యాదుల్లో వైస్సార్సీపీ వాళ్ళ హయాంలో నష్టపోయిన బాధితులకు కూటమి ప్రభుత్వం అండగా నిలవాలని ఆయన చంద్రబాబుకు  విజ్ఞప్తి చేశారు.

Read Also తెలంగాణ స్థానిక ఎన్నికలు ఆగడానికి కారణమైన ఆ పిటీషనర్ ఎవరో తెలుసా?

2022లో వైస్సార్సీపీ మాజీ మంత్రి విడదల రజిని నవతరం పార్టీ కార్యాలయంపైన, తన ఇంటిపైన దాడి చేయించిన కేసులో రజిని, ఆమె మరిది విడదల గోపి ప్రమేయం ఉందని, వారిపేర్లు ఎఫ్ ఐ ఆర్ లో చేర్చాలని, కేసు పునర్విచారణ కోసం సిట్ వేయాలని కోరగా, తగిన ఆదేశాలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీఇచ్చారని సుబ్రహ్మణ్యం తెలిపారు. అలాగే రాష్ట్ర పరిధిలో హోమ్ గార్డ్స్, ఆరోగ్య మిత్రలు ఎన్నో ఆర్థిక సమస్యలతో కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్నారని, వారిసమస్యలను కూడా పరిష్కరించాలని ముఖ్యమంత్రిని రావు సుబ్రహ్మణ్యం కోరారు.