రాహుల్.. మీకు సిగ్గనిపించడం లేదా: KTR

తాము కాంగ్రెస్‌లో చేరలేదని BRS ఫిరాయింపు MLAలు చెప్పడంపై ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ఫైరయ్యారు. ‘డియర్ రాహుల్‌గాంధీ.. ఈ ఫొటోను చూడండి. కాంగ్రెస్ కండువాలను, ఢిల్లీలో మిమ్మల్ని కలిసిన BRS ఫిరాయింపు MLAలను గుర్తుపట్టారా? ఇప్పుడు వీరు తాము పార్టీ మారలేదని, ఇది కాంగ్రెస్ కండువా కాదని అంటున్నారు. దీన్ని అంగీకరిస్తారా? ఇది ఓట్ చోరీ కాదా? మీకు సిగ్గు అనిపించడం లేదా?’ అని ప్రశ్నించారు.