OG : పవర్ స్టార్ ఓజీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓజీ. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా అభిమానుల్లో చాలా పెద్ద బజ్ నే క్రియేట్ చేసింది. ఫ్యాన్స్ అంతా ఓ ఓజీ యూనివర్స్ వైబ్ లోకి వెళ్లిపోయారు. 1000 రూపాయిల పైన ధర పెట్టి మరీ ప్రీమియర్ షోలకి అభిమానులు వెళ్లారంటే దీని క్రేజ్ ఏవిధంగా ఉందొ ఊహించుకోవచ్చు.

Also Read : Analysis : రాజ్యాధికారం ఇస్తామనిచెప్పి బీసీలను మళ్ళీ రోడ్డెక్కించారు. ఈ తప్పెవరిది?

ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 25 న ప్రపంచ వ్యాప్తంగా అనేక భాషలలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. విడుదలైన రోజు ఫ్యాన్స్ అయితే సినిమా చూసి ఊగిపోయారు. ఓజీ హడావిడి అప్పట్లో ఓ రేంజ్ లో నడిచింది. టీ షర్ట్స్ , క్యాప్స్ అంటూ ముర్చేండైజ్ కూడా బానే సాగింది. ట్రేడ్ వర్గాల్లో మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కు రెడీ అయ్యింది.

Also Read : భారత మహిళల జట్టు ప్రపంచ కప్ లో సెమీఫైనల్ కు చేరాలంటే?

ఈ నెల 23న నెట్ ఫ్లిక్స్ ద్వారా డిజిటల్ రిలీజ్ కానుంది ఓజీ. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నామని నిర్మాణ సంస్థ తెలియజేసింది. ఈ మధ్య థియేటర్లలో ఏవరేజ్ గా నడిచిన చిత్రాలు ఓటీటీలో ఆదరగొడుతున్న విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు పవర్ స్టార్ మూవీ ఓటీటీలోకి రనుండడంతో రికార్డులు బడ్డలవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. చూద్దాం ఓటీటీలో ఓజీ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుటుందో.