Official : మన హీరోయిన్ల రెమ్యునరేషన్లు చూస్తే షాక్ అవుతారు

మన అందాల ముద్దు గుమ్మలు ఆయా సినిమాలలో అలరించే యాక్టింగ్ తో, పాటలతో మనల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వాళ్లకు అటు సెలెబ్రెటీ ఇమేజ్ తోపాటు ఇటు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం ఒక రేంజ్ లో ఉంటుంది. సినీతారలకు గుళ్ళు కట్టించిన సందర్భాలు ఎన్నో. అలాంటి సినీతారలకు సంబందించిన ఎలాంటి విషయాలు బయటకొచ్చినా వాటిని తెలుసుకోవాలనే ఆసక్తి ప్రజల్లో చాలానే ఉంటుంది.

Read Also : ICC : పాకిస్తాన్ మ్యాచులకు రిఫరీగా రిచర్డ్సన్

ఇప్పుడు అలాంటి ఓ ఇన్ఫర్మేషన్ ను షేర్ చేసుకోవడానికే మీ ముందుకు వచ్చాము. ఇండియా టుడే రీసెంట్ గా ప్రచురించిన ఓ కథనంలో మన కదానాయికల రెమ్యునరేషన్లను బహిర్గతం చేసింది. ఆ రీసెంట్ రెమ్యునరేషన్స్ చూస్తే మనకు నిజంగా షాక్ కొట్టక మానదు!

Read Also : RGV : దర్శకుడు ఆర్జీవీపై ఐపీఎస్ అధికారిణి కేసు!

ముందుగా నయనతార విషయానికొస్తే ఒక్కో సినిమాకు 10 కోట్ల రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తోందట. ఇక నేషనల్ క్రష్ రష్మీక అయితే సికిందర్ కు ఏకంగా 13కోట్లు తీసుకుందట. అలాగే పుష్ప2 కు 10 కోట్లు తీసుకుందట. ఇక తమన్నా ప్రతి సినిమాకు 10కోట్లకు తగ్గడంలేదని ఆ పత్రిక వెల్లడించింది. ఇక సాయి పల్లవ ఏకంగా 10 నుండి 20కోట్లు డిమాండ్ చేస్తోందట. రామాయణంలో సీత పాత్రకు గానూ 12 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.