అంతకుముందు 13 జిల్లాలుగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వంలో జిల్లాల పునర్వ్యవస్తీకరణను పూర్తి చేశారు. దినీతో 24 జిల్లాలుగా ఏపీ అవతరించింది. ఇది పరిపాలనా సౌలభ్యానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లొనే ఈ వేసులుబాటును పొందు పరిచారు.
Also Read : ALLERT : మోంథ తుఫాన్ ముప్పు ఇంకా పొంచే ఉంది.. జాగ్రత్త!
ఇక ఇప్పుడు మరో కొత్త జిల్లాకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాజధాని కేంద్రంగా అమరావతి జిల్లాను ఏర్పాటు చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధమౌతోంది. గుంటూరు, NTR, పల్నాడు జిల్లాలలోని కొన్ని ప్రాంతాలను కలుపుకుని ఈ జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది.
Also Read : WWC : మహిళల ప్రపంచ కప్ సెమీస్ లో భారత్ తో తలపడే జట్టు అదే!
సచివాలయం, అసెంబ్లీ, కోర్టు భవనాలు, కన్వెన్షన్ కేంద్రాలు క్రమంగా ఏర్పాటు అవుతున్న నేపథ్యంలో రాష్ట్రస్థాయి కార్యక్రమాలకు అమరావతి వేదికవుతోంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల పర్యవేక్షణ, పరిపాలనా వేసులుబాటుతో పాటు ప్రోటోకాల్ భాద్యతలు పెరుగుతుండడంతో ఈ జిల్లా ఏర్పాటు అనివార్యంగా మారిందని ప్రభుత్వ వర్గాలు చెవుతున్నాయి.
