రెపటినుండీ (22/09/2025) ఏపీలో దసరా శరన్నవరాత్రి ఉత్వవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. అందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్రం ప్రభుత్వం పూర్తి చేసింది. బెజవాడ కనకదుర్గ ఆలయం విద్యుత్ కాంతులతో పండగ శోభను సంతరించుకుంది.
Read Also : మళ్ళీ ఉత్తరాది – దక్షిణాది విభేదాల్ని రాజేసిన జీయస్టీ వ్యవహారం
ఇక ఈ నెల 29న మూలా నక్షత్రం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు, సహచర మంత్రులు ఆలయానికి వచ్చి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.
Read Also : T సుబ్బిరామిరెడ్డి కంపెనీకి రూ. 5700 కోట్ల లోన్ మాఫీ.. ఇలా కూడా చెయ్యొచ్చా?
ఇక ఈ దసరా మహోత్సవం సందర్భంగా ఎప్పటి మాదిరిగానే అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకరంతో, మొత్తంగా 11 అలంకరణలతో పూజించనున్నారు.
విజయవాడ కనకదుర్గ ఆలయంలో అమ్మవారి అలంకారాలు :
సెప్టెంబర్ 22 : బాలా త్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 23 : గాయత్రి దేవి
సెప్టెంబర్ 24 : అన్నపూర్ణ దేవి
సెప్టెంబర్ 25 : కాత్యాయని దేవి
సేవ్టెంబర్ 26 : మహాలక్ష్మి దేవి
సెప్టెంబర్ 27 : లలిత త్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 28 : మహా చండి దేవి
సెప్టెంబర్ 29 : సరస్వతీ దేవి (మూల నక్షత్రం)
సెప్టెంబర్ 30 : దుర్గా దేవి
అక్టోబర్ 01 : మహిషాసుర మర్ధిని
అక్టోబర్ 02 : రాజరాజేశ్వరి
