ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మోంథ తుఫాన్ ముంగిట నిలిచింది. రాష్ట్రంలో దాదాపు అన్ని చోట్లా తుఫాన్ ప్రభావం ప్రారంభమైపోయింది. ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. ఈరోజు ఈ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనుంది. ఈ రోజు రాత్రికే మోంథ తుఫాన్ తీరం దాటనుంది. ఇక ఈ తుఫాన్ ఏ మేరకు భీభత్సం సృష్టిస్తుందో అని అంతా ఆందోళన చెందుతున్నారు. హుద్ హుద్, దివిసీమ ఉప్పెన రోజులను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు.
Read Also : MANTHA CYCLONE : దూసుకొస్తున్న తీవ్ర తుఫాన్. ఏపీని ముంచెత్తనున్న అతి భారీ వర్షాలు
ప్రస్తుతం మోంథ తుఫాన్ గంటకు 17కీ.మీల వేగంతో ప్రయనిస్తుండగా ఈరోజు (28 అక్టోబర్) 7గంటల సమయానికి విశాఖపట్నానికి 370 కి.మీల దూరంలో, కాకినాడకు 310కిమీల దూరంలో, మచిలీపట్నానికి 230కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మరి కాసేపట్లో ఇది తీవ్ర తుఫాన్ గా మారనుంది. ఇక ఈరోజు రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మచిలీఓట్నం, కాకినాడ మధ్య తీరం దాటనుంది. దీనితో ఈ రోజు సాయంత్రం నుండి కాకినాడ, విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా చోట్ల కూడా తుఫాన్ ప్రభావం బలంగానే ఉంటుంది.
Also Read : కోలుకుంటున్న శ్రేయాస్ అయ్యర్. ఇంకా ఆస్ట్రేలియాలోనే..
ఇక ఈ రోజు మధ్యాన్నం ఒంటిగంట నుండీ రేపు ఉదయం 10 గంటల వరకూ కీలకంగా మారనుంది. ఈ ఒక్క రాత్రి క్షేమంగా గడవలని ఆశింస్తున్నారు అధికారులు. ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సూచిస్తున్నారు. విద్యుత్ అంతరాయం కలిగే అవకాశం ఉన్నందున ఛార్జింగ్ విషయంలో వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు తడవజుందా జాగ్రత్త వహించాలి. చిన్నపిల్లలు ఉంటే పాలు, మరియు ఇంటిల్లిపాదికి రెడీమేడ్ గా తినగలిగిన ఫుడ్ రెడిగా పెట్టుకోండి. ఫోన్ పేల మీద ఆధార పడకుండా కొంత క్యాష్ సైతం సిద్ధం చేసుకుని ఉంచుకోవడం మంచిది. రాబోయే 24 గంటలు కీలకం. జాగ్రత్త…!
