ఆంధ్ర ప్రదేశ్ లో సంచలనంగా మారిన లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో A39 గా ఉన్న మాజీ ఎంయల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది సుప్రీంకోర్టు. మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈరోజు (అక్టోబర్ 10) విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో ఏపీ సర్కార్ కు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Read Also : Nobel Prize : నోబుల్ ప్రైజ్ అనౌన్స్ చేసిన కమిటీ. ఎవరికంటే?
విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక చిన్న కేసును వదించడానికి ముకుల్ రోహిద్గీ, సిద్దార్ద్ లూద్రా వాటి పెద్ద లాయర్లు రవాల్సినంత అవసరం ఉందా అని వ్యాఖ్యానించింది. కెవం ఒక కారులో డబ్బులు తరలించారన్న ఆరోపణ తప్ప సరైన సాక్షాలు లేవని మోహిత్ రెడ్డి తరుపు న్యాయవాది కోర్టుకు తెలుపగా అందుకు ధర్మాసనం అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కాం కేసులో మోహిత్ రెడ్డిని A39 గా ఉండగా A38 గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం విజయవాడ జైల్లో జ్యూడిషయల్ రిమాండ్ లో ఉన్నారు.
Read Also : తెలంగాణ స్థానిక ఎన్నికలు ఆగడానికి కారణమైన ఆ పిటీషనర్ ఎవరో తెలుసా?
ఇదిలా ఉండగా లిక్కర్ స్కాంలో బెయిల్ కోసం ముందుగా హైకోర్టును ఆశ్రయించారు మోహిత్ రెడ్డి. అక్కడ మోహిత్ రెడ్డికి ఊరట దక్కక పోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంలో ఈరోజు విచారణ జరిపిన ధర్మాసనం మోహిత్ రెడ్డి వాదనలతో ఏకీభవించి ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
