టాలీవుడ్ యంగ్ హీరో తేజా సజ్జ నటించిన పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం ‘మిరాయ్’ OTT హక్కులను జియో హాట్‌స్టార్ దక్కించుకుంది. 6 నుంచి 8 వారాల థియేటర్ స్క్రీనింగ్ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వొచ్చని సినీవర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ కూడా ఉండనుందని ‘మిరాయ్’ మూవీ ఎండ్ కార్డులో ప్రకటించారు. ‘జైత్రయ’ అనే టైటిల్‌ను వెల్లడించగా ఇందులో నటుడు రానా విలన్‌గా నటిస్తారని టాక్ వినిపిస్తోంది.
