పశ్చిమ మధ్య, వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో ఇది కేంద్రీకృతమైందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో 3 రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడతాయంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు
