కేటీఆర్, బీ ఆర్ యస్ నుండీ పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి రాహుల్ గాంధీ స్పందించాలని అంటున్నారని, అసలు రాహుల్ ఎందుకు స్పందించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఫైర్ అయ్యారు. అసలు రాహుల్ స్థాయి ఏంటి? కేటీఆర్ స్థాయి ఏంటని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరంపై విచారణ తప్పించుకునేందుకే మెడీ అడుగులకు కేటీఆర్ మడుగులు ఒత్తుతున్నారని, బీజేపీలో విలీనం గురించి ఇప్పటికే కవిత ప్రస్తావించారనీ ఆయన విమర్శించారు.

అంతకుముందు కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా బీ ఆర్ యస్ నుండీ కాగ్రెస్ లోకి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాహుల్ గాంధీతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఘాటుగా స్పందించారు. కండువాలు కప్పించుకుని కాగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు మేము పార్టీ మరలేదని, అవి కాంగ్రెస్ కండువాలు కాదని అంటున్నారని, మరి రాహుల్ ఎందుకు స్పందించరని ఆయన ప్రశ్నించారు.
Read Also : India vs Pak : ఇండియా పాక్ మ్యాచ్ కు ఇంకా అమ్ముడుపోని టికెట్లు కారణం ఇదేనా?
ప్రజాస్వామ్యంలో ఎవరికి ఇష్టం వచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అది తప్పుకాదు. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయాలు చేసేవారు మాత్రం ఆ ప్రజాస్వామ్య ప్రాధమిక సూత్రాలకు కట్టుబడి ఉండాలి. ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తిని ఒక ముఖ్య మంత్రి స్థాయి వ్యక్తి విమర్శించే అర్హత ఉందా అని ప్రశ్నించడం బానేవుంది కానీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను మా పార్టీ వారే అని ధైర్యంగా చెప్పులేకపోవడం, అలాగే వాళ్ళు మా పార్టీలో చేరలేదని, అవి మా కండువాలు కాదని బుకాయించడం ఎలాంటి ప్రజాస్వామ్యమో ఒక్క సారి ఆలోచించాలి. అర్హత కంటే, ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్యం నిలబడటం, బ్రతికుండడం చాలా ముఖ్యం.
