Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు

ఉప రాష్ట్రపతి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాక రేపుతూనే ఉన్నాయి. ఇండియా కూటమి నుండి 15 ఓట్లు చీలి ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ కు పడడంతో, ఆ ఓట్లు ఎవరివన్న చర్చ దేశంలో పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇవ్వాళ్ళ BRS ఫయిర్ బ్రాడ్ కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చెయ్యడంతో వ్యవహారం మరింత వేడెక్కింది.

Read Also : RGV : దర్శకుడు ఆర్జీవీపై ఐపీఎస్ అధికారిణి కేసు!

ఈరోజు మీడియాతో మాట్లాడిన కౌశిక్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి కోట్ల రూపాయల డబ్బుల కోసం బీజేపీకి ఓట్లు అమ్ముకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. క్రాస్ ఓటింగ్ ద్వారా ఎన్డీయేకు పడిన 15 ఓట్లలో 8 ఓట్లు తెలంగాణ ఎంపీలవే అని కౌశిక్ రెడ్డి బాంబ్ పేల్చారు.

Read Also : CBSC : స్టూడెంట్స్ కు షాక్ ఇచ్చిన సీబీయస్సీ బోర్డ్

అంతటితో ఆగని ఆయన మరింత ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆ 8 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసిన విషయాన్ని స్వయంగా ఓ ముగ్గురు ఎంపీలు తనతో చెప్పారని, దీన్నీ బట్టీ రేవంత్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చని కౌశిక్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కాక రేపుతున్నాయి. ఆ ఎంపీలు ఎవరు, అసలు ఏం జరిగింది, ఈ వ్యాఖ్యలలో ఎంత నిజముంది అనేవిషయాన్ని పలువురు కాంగ్రెస్ సీనియర్లు అరా తీస్తున్నారు.