సినీనటుడు, హిందూపురం ఎమ్యల్యే నందమూరి బాలకృష్ణపై మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాగిన వాడిని అసెంబ్లీకి ఎలా రనిచ్చారని కామెంట్ చేశారు. అసలు తాగిన వాళ్ళని అసెంబ్లీకి రనివ్వడమే తప్పైతే అతనితో శాసన సభలో ఎలా మాట్లాడించారని, అలా చెయ్యడానికి స్పీకర్ కి బుడ్డుండాలని ఎద్దేవా చేశారు. ఏపీ చివరి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ మాట్లాడుతూ హీరో చిరంజీవిపై, మంత్రి దుర్గేష్ పై సెస్నేషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే.
Also Read : ఏపీలో గూగుల్ వార్.. టీడీపీకి బీజేపీ ఝలక్
అప్పట్లో బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆ సైకో (జగన్) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి సినిమా వాళ్లకు చేసిందేమీ లేదని, ఆయన గురించి అంత చెప్పాల్సిన అవసరం లేదని అంతకు ముందు ఎంమ్యలే కామినేని చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తరువాత చిరంజీవి సైతం బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. అప్పుడు అనేక సార్లు ప్రభుత్వంతో మంతనాలు జరిపి సమస్య పరిష్కరించింది తానేనని, స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేసి మరీ సినీ పెద్దలను జగన్ వద్దకు తీసుకళ్లానని, ఆ చర్చల సమయంలో జగన్ నన్ను సాదరంగా స్వాగతించారని, ఎలాంటి అవమానం ఆయన చేయలేదని కుండ బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సంబంధించిన వివరాలను ప్రెస్ మీట్లో ఓ విలేఖరి అడిగినప్పుడు జగన్ పై విధంగా సంచలన కామెంట్స్ చెయ్యడం విశేషం.
