ఇస్రో మరో అద్భుత విజయం నమోదు చేసుకుంది. LVM3-M5 రాకెట్ ద్వారా CMS-03 శాటిలైట్ ను 16.09 నిమిషాల్లో నిర్దేశిత కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది శాస్త్రవేత్తల బృందం.
Also Read : WWC : చరిత్ర సృష్టించేందుకు ఒకే ఒక్క అడుగు దూరంలో భారత్.. నేడే వరల్డ్ కప్ ఫైనల్
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ లో ఆదివారం సాయంత్రం గం5.26 నిలకు ఈ ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా దేశానికి భద్రతతో కూడిన, అధునాతన కమ్యూనికేషన్ వ్యవస్థను అందించడం ప్రధాన లక్ష్యం. ఇది దేశ రక్షణ, సముద్ర పర్యవేక్షణ, వ్యూహాత్మక సమాచార మార్పిడి వంటి ఆశాలలో కీలకంగా మారనుంది.
