ఈరోజుల్లో ఏఐ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. అలాగే ఈ ఏఐ ప్రతివారి జీవితంలో ఓ భాగం ఐపోయింది. చాట్ జీపీటి, మెటా ఏఐ, జెమిని వంటి అనేక టూల్స్ ను నిత్యం ఉపగిస్తూనే ఉన్నాం. అలాగే వాట్సాప్, కాన్వా వంటి అప్లికేషన్స్ లో ఏఐ భాగస్వామ్యం బాగా పెరిగిందని చెప్పాలి.
AlsoRead : APSRTC : స్త్రీశక్తి పధకంలో బయటపడ్డ అవకతవకలు. ఇది మరొపెద్ద స్కామ్ అంటూ ఆరోపణలు
ఈ విధంగా చూస్తే ఇప్పటికే ఏఐ వాడకం మనదేశంలో విపరీతంగా పెరిగిపోయింది. రాబోయే కాలంలో ఇది దాదాపు 10 రేట్లు పెరిగే అవకాశం ఉంది. అలాగే మేడిన్ ఇండియాకు ఆదరణ లభిస్తున్న ఈ తరుణంలో అనేక రకాల అప్లికేషున్లు మార్కెట్లోకి రానున్నాయి. దీంతో ఏఐ డేటా సెంటర్లని కూడా గణనీయంగా పెంచవలసి ఉంటుంది.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బిగ్ రిలీఫ్
ఇక్కడే ఇప్పుడు అసలు సమస్య తలెత్తనుంది. ఈ ఏఐ డేటా సెంటర్లను మైయింటైన్ చెయ్యడానికి అధిక మొత్తంలో విద్యుత్ శక్తి అవసరమవుతుంది. దీనితో విద్యుత్ వినియోగం పెరిగి పవర్ కట్లతోపాటు, కరెంట్ సరఫరా క్వాలిటీలో మార్పులు ఏర్పడడం, విద్యత్ చార్జీలు పెరగడం వంటి సమస్యలు తలెత్తుతాయని జోహా కంపెనీ అధినేత శ్రీధర్ చెబుతున్నారు. 2023 తర్వాత ఏథెన్స్, జార్జియా వంటి ప్రదేశాల్లో 60% నికి పైగా విద్యత్ చార్జీలు పెరిగిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఏఐ వాడకం పెరిగే కొద్దీ దాని ప్రభావంతో పరోక్షంగా విద్యుత్ రంగంపై అతి భారం పడనుంది.
