Women’s ODI World Cup : ఈరోజే ఇండియా సౌత్ ఆఫ్రికా మ్యాచ్. మ్యాచ్ జరిగేది ఎక్కడంటే?

మహిళా వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్, శ్రీలంకపై గెలిచి ఉపుమీదున్న టీమ్ ఇండియా కీలక సమరానికి సిద్ధమైంది. ఇంత వరకు తేలికైన ప్రత్యర్డులతో పోటీపడ్డ హర్మన్ సేనకు గట్టిపోటీ ఈరోజు నుండీ ప్రారంభం కానుంది. ఇప్పటికి 4 పాయిట్లు సాధించిన టీమ్ ఇండియా టేబుల్ సెకండ్ ప్లేస్ లో ఉండగా ఆస్ట్రేలియా 5 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.

Read Also : నటుడు మోహన్ బాబుకు షాక్. కావాలనే టార్గెట్ చేసారా?

అటు సౌత్ ఆఫ్రికా ఇంగ్లాండ్ తో జరిగిన ఫస్ట్ మ్యాచులో 20.4 ఓవర్లలో కేవలం 69 పరుగులకే అల్ ఔట్ అయ్యి టోర్నమెంట్ ను ఘోరమైన ఓటమితో ప్రారంభించింది. కానీ తరువాత తేరుకుని తన రెండవ మ్యాచ్ లో టోర్నమెంట్ ఫేవరేట్స్ లో ఒకరైన న్యూజిల్యాండ్ ను చిత్తుచేసి రితమ్ లోకి వచ్చేసింది. తమ పాటన్షియల్ కు తగ్గట్టుగా ఆడితే భారత్ కు విజయం కోసం చేమటోడ్చక తప్పదు.

Read Also : ప్రధాని నరేంద్ర మోదీకి కంగ్రాట్స్ చెప్పిన జగన్. ఈ బంధం ఇంకా బలంగానే ఉందా?

ఇక ఈ మ్యాచ్ మన సముద్రతీర నగరమైన వైజాగ్ లో జరగనుండడం విశేషం. ఈరోజు మధ్యాన్నం 3 గంటలనుండీ ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో భారత జట్టే ఫేమరేట్స్ గా బరిలోకి దిగుతోంది. రెండు మ్యాచులు వరసగా గెలిచి ఫామ్ లో ఉండడం, ఆఖరి మ్యాచులో మంచి షాట్లతో స్మృతి మందన టచ్ లోకి రావడంతో పాటు హోమ్ కండిషన్స్ లో అడనుండడం మనకు కలిసొచ్చే అంశాలు. బోలింగ్ లో మనకు కొన్ని సమస్యలు ఉన్నాయనేది వస్థవం కానీ స్థాయికి తగ్గట్లుగా ఆటగాళ్లు పర్ఫార్మెన్స్ ఇస్తే గెలుపు నల్లేరుమీద నడకే అవుతుంది. అదేవిధంగా ఫస్ట్ మ్యాచ్ హీరోయిన్ అమన్ జోత్ గాయం నుంచీ కొలుకుంటే మనకు బాలింగ్ కష్టాలు కొంతవరకూ తీరుతాయి. మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియూ హాట్ స్టార్ లో లైవ్ చూడచ్చు. All the best Team India