WWC : బిగ్ మ్యాచ్ కు అంతా రెడీ. నేడే ఇండియా ఆస్ట్రేలియా సెమీఫైనల్

మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఈరోజు భారత జట్టు కీలక సమరానికి సిద్ధమైంది. ఆస్ట్రేలియాతో ఈరోజు మధ్యాన్నం 3 గంటలనుండీ నవీ ముంబై లోని DY పాటిల్ స్టేడియంలో వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు నవెంబర్ 2న జరిగే ఫైనల్ లో సౌత్ ఆఫ్రికాతో తలపడుతుంది.

Also read : తాగిన మత్తులో ఇన్ఫోసిస్ ఉద్యోగి వీరంగం.. గృహిణి తో అసభ్య ప్రవర్తన

ఇక ఈ మ్యాచులో ఫేవరేట్స్ గా ఆస్ట్రేలియన్ టీమే ఉండనుంది. ఇప్పటివరకు 14 సార్లు వరల్డ్ కప్ లో ఇరు జట్లు తలపడగా, కేవలం మూడు సార్లు మాత్రమే మన జట్టు గెలిచింది. కానీ ఆస్ట్రేలియాతో ఈ టోర్నమెంట్ లో జరిగిన లీగ్ మ్యాచులో ఇండియా ఆదరగొట్టింది. మ్యాచ్ ఓడినా అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈరోజు మ్యాచులో కూడా అలాంటి ప్రదర్శనే రావాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఓపెనర్ ప్రతీక రావల్ కు బాగ్లాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో గాయం కాగా ఆమె టోర్నమెంట్ మొత్తానికి దూరమయ్యారు. ఆమె స్థానంలో డాషింగ్ ఓపెనర్ షెఫాలి వర్మ టీమ్ లోకి వచ్చారు. దీనితో టీమ్ మరింత బలపడింది. ఆసీస్ లాంటి విద్వంసకర జట్టుతో ఆడేటప్పుడు గెలవాలంటే  ఓ X ఫ్యాక్టర్ ప్లేయర్ కావాలి. ఆ స్థానానికి షఫాలీ సరిగ్గా సరిపోతుంది.

Also Read : కాంగ్రెస్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి

 కానీ, ఈ మ్యాచ్ జరగడం అనుమానాస్పదంగా మారింది. దీనికి కారణం వర్షం. వాస్తవానికి, ప్రపంచ కప్‌లో అనేక మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు అయ్యాయి. ఇప్పుడు సెమీఫైనల్ మ్యాచ్‌ కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. అయితే, సెమీ-ఫైనల్ మ్యాచ్‌ కు రిజర్వ్ డే ఉన్నందున, మ్యాచ్ షెడ్యూల్ చేసిన రోజున జరగకపోతే, రిజర్వ్ డే రోజు నిర్వహిస్తారు. ఆ రోజు కూడా ఫలితం వచ్చే పరిస్థితి లేకపోతే పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఫైనల్‌కు చేరుతుంది.