World Cup : మహిళల ప్రపంచ కప్ లో భారత్ సెమీస్ ఆశలు సజీవం

మహిళల వన్డే ప్రపంచ కప్ ఆఖరి అంకానికి చేరుకుంటోంది. ఇక లీగ్ దశలో ప్రతి జట్టూ చివరి రెండు మ్యాచులలో ఆడాల్సి ఉంది. ఇప్పటికే ప్రతి జట్టూ 5 మ్యాచులు ఆడింది. టోర్నమెంట్ లో ఇప్పటివరకూ అజేయంగా ఉన్న ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు చెరో 9 పాయింట్లతో ఇప్పటికే సెమీఫైనల్ కు క్వాలిఫై అయిపోయాయి. ఇక మూడవ స్థానంలో ఉన్న సౌత్ ఆఫ్రికా జట్టు ఇప్పటికే 8 పాయిట్లు సాధించి సెమీస్ లో తన ప్లేస్ ను ఖాయం చేసుకుంది.

Also Read : Muhurath Trading : ముహూరత్ ట్రేడింగ్ సమయాల్లో మార్పు.. ఎప్పుడంటే?

సెమీస్ లో మిగిలిన ఆఖరి స్పాట్ కోసం ఇండియా, న్యూజిల్యాండ్ జట్లు పోటీ పడుతున్నాయి. 5 మ్యాచులు ఆడిన ఇండియా రెండింటిలో గెలిచి మూడింటిలో ఒడి 4 పాయింట్లతో ఉండగా, న్యూజిల్యాండ్ 5 మ్యాచులో ఒక మ్యాచ్ గెలిచి, రెండు మ్యాచులలో వర్షం కారణంగా ఫలితం తేలకపోవడంతో 4 పాయింట్లతో ఉంది. పాకిస్తాన్, శ్రీలంక వంటి బలహీన జట్లతో జరగాల్సిన మ్యాచులు రద్దవడంతో న్యూజిల్యాండ్ కు సెమీస్ అవకాశాలు ఇంకా ఖరారు కాలేదు. ఇదే ఇప్పుడు భారత్ కు మంచి పరిణామంగా మారింది. రన్ రేట్ కారణంగా న్యూజిల్యాండ్ కంటే ఒక్క అడుగు ముందున్న భారత్ టేబుల్లో 4వ ప్లేస్ లో నిలిచింది.

Also Read : OG : పవర్ స్టార్ ఓజీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇక ఈక్వేషన్ ను గమనిస్తే భారత్ సెమీస్ ఆశలు సజీవంగానే ఉన్నాయి. భారత్ తన తదుపరి రెండు మ్యాచులను 23న న్యూజిల్యాండ్ తో, 26న బంగ్లాదేశ్ తో ఆడనుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిస్తే భారత్ నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. బాంగ్లాదేశ్ మీద ఎలాగూ భారత్ గెలుస్తుంది అనుకుంటే న్యూజిల్యాండ్ మీద మ్యాచ్ కీలకం కానుంది. ఒక వేళ ఆ మ్యాచులో న్యూజిల్యాండ్ చేతుల్లో ఓడిపోయి బాంగ్లాదేశ్ పై గెలిస్తే, అటు న్యూజిల్యాండ్ సైతం ఇండియా పై గెలిచి ఇంగ్లాండ్ మీద ఓడిపోతే, ఏ జట్టుకు ఎక్కువ రన్ రేట్ ఉంటుందో ఆ జట్టు సెమీస్ కు చేరుతుంది. ఇక చివరిగా మనం ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి, న్యూజిల్యాండ్ ఇండియాతో పాటు అజేయ ఇంగ్లాండ్ ను కూడా ఒడిస్తే మాత్రం అప్పుడు మనం ఇంతటితో సరిపెట్టుకోక తప్పదు. ఈ నేపథ్యంలో ఒక వేళ మనం సెమీస్ కు చేరితే దాదాపు 29న మన సెమీఫైనల్ మ్యాచును ఆస్ట్రేలియాతో ఆడాల్సి రావచ్చు.