WWC : వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ కు చేరిన భారత మహిళల జట్టు

భారత జట్టు మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో  సెమీ ఫైనల్ కు చేరుకుంది. ఈరోజు (అక్టోబర్ 23) న్యూజిల్యాండ్ తో ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్లో టీమ్ ఇండియా ప్రత్యర్థి జట్టును 53 పరుగుల తేడాతో ఓడించి సెమీస్ లో మిగిలిన ఆఖరి బెర్త్ ను ఖాయం చేసుకుంది. అంతకు ముందు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ కు చేరిన విషయం తెలిసిందే.

Also Read : ఏపీలో సర్పంచ్, పరిషత్ ఎన్నికలపై కీలక అప్డేట్

అంతకు ముందు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా 49 ఓవర్లలో 340 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతి మందన (109), ప్రతీక రావల్ (122) సెంచరీలతో చేలాగరేగారు. మొదటి వికెట్ కు 200 పైచిలుకు భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తర్వాత జమీమా (76) కూడా చెలరేగడంతో ఇండియా భారీ స్కోరు చేసింది. ఇండియా ఇన్నింగ్స్ లో ఆఖరి ఓవర్ అడకముందే చివరిలో వర్షం రావడంతో న్యూజిల్యాండ్ లక్ష్యాన్ని DLS పద్ధతి ద్వారా 44 ఓవర్లలో 325 గా నిర్ణయించారు.

Also Read : బాలకృష్ణపై మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

325 పడుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ జట్టును క్రాంతీ గౌడ్ రెండవ ఓవర్లోనే దెబ్బ తీసింది. బాట్స్ ఒక పరుక్ఖే ఔట్ అయింది. ఆ తర్వాత ఏ దశలోనూ న్యూజిల్యాండ్ కొలుకునేలా కనిపించలేదు. ఓవర్లు గడుస్తున్నకొద్ది కావాల్సిన రన్ రేట్ పెరుగుతూ పోయింది. దానితో చివరి వరకూ బ్రూక్ హాలిడే (81), ఇసబెల్లా (65) పోరాడినా కివీస్ ను గెలిపించలేకపోయారు. ఈ గెలుపుతో ఇండియా సెమీస్ లోకి అడుగుపెట్టింది. ఇక సెమీస్ చేరుకున్న జట్ల తాలూకూ చివరి మ్యాచుల్లో ఎలాంటి రన్ రేట్ మార్పులు జరగకపోతే భారత జట్టు సెమీస్ పోరులో ఆస్ట్రేలియాను ఎదుర్కోవాల్సి రావచ్చు.