పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్ అంటేనే ఒంటి కాలుపై లేస్తున్నారు భారత ప్రజలు. ఆపరేషన్ సింధూర్ తో పాకిస్థాన్ వెన్నులో వణుకు పుట్టించిన సైన్యం ఇండియా అంటే ఎంటో ఆ ఉగ్రదేశానికి రుచి చూపించింది. ఇక ఆ తర్వాత అటు యుద్ధభూమే కాదు, ఇటు క్రికెట్ కూడా ఓ యుద్ధమే అయిపోయింది. మొన్న జరిగిన ఆసియా కప్పే ఈ వాతావరణానికి సజీవ సాక్ష్యం. నో షేక్ హ్యాండ్స్ తో మొదలైన ఈ వివాదం ఎన్నో మలుపులు తిరిగి ఆఖరికి పాకిస్థాన్ వ్యక్తి చేతుల మీదుగా కప్ తీసుకోవాల్సి వస్తే అసలు మాకు ఆ కప్పే వద్దు అని గెలిచి కూడా కప్ వదిలేసి వచ్చే వరకు వెళ్ళింది.
Read Also : BREKING NEWS విజయ్ దేవరకొండ రష్మీక నిశ్చితార్థం
మామూలుగానే దాయాది సమరం పేరుతో ఇండియా పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటేనే ఫ్యాన్స్ ఓ రేంజిలో టీవీలకు అతుక్కుపోతారు. ఇక ఇప్పుడైతే దాని మోతాదు మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక అసలు విషయానికొస్తే ఇప్పుడు మళ్లీ అలాంటి మరో ఇండియా పాకిస్థాన్ సమరానికి రంగం సిద్ధమైంది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఈరోజు ఇరుజట్లమధ్య కొలంబోలోని ప్రేమదాసా స్టేడియంలో మ్యాచ్ జరగనుంది.
Read Also : BSNL ఈసిమ్ సేవలు ప్రారంభం. సిమ్ లేకుండానే కాల్స్..
ఇక ఒకసారి ఇరుజట్లను పరిశీలిస్తే ఇండియన్ టీమ్ కంపోజిషన్ చాలా బాగుంది. ప్రతికా రావల్, స్మృతి మందనాతో మన ఓపెనింగ్ చాలా పటిష్టంగా ఉంది. స్మృతి అయితే తన కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉండడం మనకి ఈ టోర్నమెంట్ లో కలిసొచ్చే అంశం. అటు హార్లీన్ డియోల్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా మంచి ఫాల్లో ఉన్నారు. ఇక జెమీమ రోడ్రిక్స్, రిచా ఘోష్, దీప్తి శర్మలతో కూడిన మన మిడిల్ ఆర్డర్ చాలా పటిష్ఠంగా ఉంది. గాయం నుంచి ఈ మధ్యనే కోలుకున్న అమంజోత్ కౌర్ కూడా శ్రీలంకతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో అద్భుతంగా ఆడి మన గెలుపులో కీలక పాత్ర పోషించడంతో మన లోయర్ ఆర్డర్ కష్టాలు కూడా తీరిపోయినట్టే. ఇక పాకిస్తాన్ జట్టు ఆఖరి మ్యాచులో బాంగ్లాదేశ్ తో సైతం ఓడిపోయి టోర్నమెంట్ లో ఉనికి కోసం పోరాడుతోంది. ఏదేమైనా ఇండియా పాకిస్తాన్ సమరమంటే ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్ ఫైటే. ఈరోజు మధ్యాన్నం 3 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ & జియో హాట్ స్టార్ లో లైవ్ చూడచ్చు.
