Analysis : అజేయంగానే ఫైనల్ కు.. కానీ ఆ లోపాల సంగతేంటి?

ఆసియా కప్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న భారత జట్టు నిన్న శ్రీలంకతో జరిగిన హై స్కోరింగ్ మ్యాచులో సూపర్ ఓవర్లో సూపర్ విక్టరీ కొట్టి అజేయంగా ఫైనల్ కు చేరింది. దీంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఇదీ చదవండి : ట్రంప్ సంచలన ప్రకటన. భారత కంపెనీలకు నష్టం తప్పదా?

కానీ జట్టులో ఉన్న కొన్ని లోపాలు టీమ్ ఇండియాను కలవర పెడుతున్నాయి. 2026 టీ20 వరల్డ్ కప్పుకు వార్మ్ అప్ గా భావిస్తున్న ఈ టోర్నమెంట్ లో జట్టులోని లోపాలు బయటపడ్డాయి.

ఇదీ చదవండి: Rohit Sharma : 10కేజీలు తగ్గిన హిట్ మ్యాన్! వరల్డ్ కప్ కు ఫిక్స్ చేసాకే..?

సూర్యకుమార్ యాదవ్ ఫామ్:

కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ మనల్ని కలవర పెడుతున్న మొదటి అంశం. యూఏఈ మీద అవసరం లేకపోవడం వల్ల చిన్న స్కోర్ కే పతిమితమవడం, లీగ్ స్టేజ్ లో పాకిస్తాన్ మీద చేసిన 47 నాట్ ఔట్ మినహాయిస్తే ఈ సీరీస్ లో ఏ క్రమంలోనూ సూర్యకుమార్ తన స్కిల్ కు తగ్గట్టు ఆడలేదు. ఒమాన్ మీద అసలు బ్యాటింగ్ కే రాలేదు. మిగతా మూడు  మ్యాచులో అతను వరసగా 0, 5, 12 మాత్రమే చేసి మొత్తం 17 పరుగులకే పరిమితమయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో విపరీతమైన మార్పులు, ఫీల్డింగ్ లోపాలతో కెప్టెన్ గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అటు టీమ్ లోకి గిల్ రావడంతో కొంత అభద్రత భావానికి సైతం గురి అయ్యి ఉండొచ్చు. మరోవైపు గిల్ కూడా ఒక్కటి అరా మినహా పెద్దగా (20, 10, 5, 47, 29, 4) రణించలేదు.

దిద్దే చదవండి : Guntur : గుంటూరులో పనీపూరీపై నిషేధం

మిడిల్  ఆర్డర్ పూర్తిగా విఫలం :

మిడిలార్డర్ తో టీమ్ ఇండియా పెద్ద సమస్యలే ఎదుర్కుంటోందని చెప్పాలి. అభిషేక్ శర్మ రూపంలో భారత్ కు అద్భుతమైన ఆరంభాలు వస్తున్నా వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో మిడిలార్డర్ పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచులో తిలక్ వర్మ సంజూ సాంసన్ రాణించి కొంత వరకు మళ్ళీ గాడిలో పడే పరిస్థితికి తెచ్చారు. ఇంతకు ముందు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్నప్పుడు టీమ్ కాంబినేషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. గంభీర్ కోచ్ అయ్యాక ప్రయోగాలు ఎక్కువగా జరుగుతుండటంతో మిడిలార్డర్ ఈరోజు వరకు సరిగ్గా కుదురుకోలేదు. ఎవరెక్కడ ఆడతారు?, అసలు ఎవరు ప్లేయింగ్ ఎలవెన్ లో ఉంటారు అనేదానిమీద కూడా క్లారిటీ లేకపోవడంతో ఆటగాళ్లపై ఉండే ఇత్తిడి ప్రదర్శనపై ప్రభావం చూపుతోంది.

ఇదీ చదవండి : YS Jagan : “డిజిటల్ బుక్” తో కార్యకర్తలకు న్యాయం చేస్తాం : వైయస్ జగన్

పేస్ విఫలం :

బూమ్రా నాయకత్వంలోని భారత పేస్ దళం జట్టుకు కు ఇప్పటివరకు వెన్నెముకగా నిలుస్తూ వస్తోంది. కానీ ఈ టోర్నమెంట్ లో బూమ్రతో సహా అందరు పేస్ బోలర్లు విఫలమయ్యారు. ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించిన మన ట్రంప్ కార్డ్ బూమ్రా-పడ్యా ద్వయం ఈ సీరీస్ లో ఏ దశలోనూ ప్రభావం చూపలేదు. అటు ఆర్షదీప్ సింగ్ కూడా అడపా దడపా మంచి యార్కర్లు వెయ్యడం తప్పితే పరుగుల వరదను మాత్రం అపలేకపోయారు. ఇక హర్షిత్ రణాను నిన్న లంక బ్యాటర్లు ఒక ఆట ఆడుకున్న విషయం తెలిసిందే. ఇక గాయం నుంచి కొలుకన్నాక బూమ్రా మునుపటి రిధమ్ ను అందుకోలేదు. ఇది మనకు రాబోయే కాలంలో ఓ పెద్ద సమస్యగా మారనుంది.

ఇదీ చదవండి : Krithi Shetty : బ్లాక్ స్కర్ట్ లో అందాలొలికిన కృతీ శెట్టి

పేలవమైన ఫీల్డింగ్ :

ఈ సీరీస్లో భారత జట్టు ఫీల్డింగ్ అద్వాన్నంగా ఉందని చెప్పడంలో తప్పేమీ లేదు. టోర్నమెంట్ లొనే అత్యధికంగా మన జట్టు 12 క్యాచులు వదిలేసింది. ఈ గణాంకం హాంకాంగ్(11), బాంగ్లాదేశ్(10) కంటే దారుణంగా ఉంది. ఇక మిస్ ఫీల్డులు అయితే లెక్కలేనన్ని చేశారు. ఈ విషయంలో చాలా త్వరగా మెరుగుపడాల్సిన అవసరం ఉంది.

కొంపముంచిన మితిమీరిన ప్రయోగాలు :

ఈ టోర్నమెంట్ లో ఈ మధ్యకాలంలో ఎనాడూ లేని విధంగా మన జట్టు ప్రయోగాల బాట పట్టింది. వరల్డ్ కప్పుకు జట్టును రెడీ చేసి క్రమంలోనే ఈ ప్రయోగాలని సర్దిచెపుకున్నా అది సరైన విధానం కాదు. మనం ప్రయత్నించిన ప్రయోగం ఆ మ్యాచులో సక్సెస్ అయినా, ఫెయిల్ అయిన ఆ ఒక్క ప్రదర్శన ద్వారా నిర్ణయం తీసుకోవడం సరైనది కాదనేది వాస్తవం. ప్రాక్టీస్ సెషన్స్ లో వారి ప్రదర్శన, జట్టు ప్రణాళిక ప్రకారం ఎవరి పాత్ర ఏంటి? ఒకవేళ ఒకళ్ళ ఫామ్ లేమి ఇబ్బంది పెడితే, మరో రీప్లేస్మెంట్ ఎవరు? ఇలాంటి అనేక కాంబినేషన్స్ తో ఒక తుది జట్టును సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ జట్టుకు మ్యానేజ్మెంట్ మరియూ కెప్టెన్ నుండి పూర్తి మద్దతు అవసరం అవుతుంది. అలాంటి అప్రోచ్ ఈ టోర్నమెంట్ లో ఏ దశలోనూ కనబడలేదు. దీనిపై కోచ్ గంభీర్ & మ్యానేజ్మెంట్ ఖచ్చితంగా దృష్టి పెట్టాలి.

చివరిగా ఏది ఏమైనా, ఈ లోపాలన్ని అధిగమించి, ఫైనల్లో ముచ్చటడా మూడోసారి పాకిస్తాన్ ను మట్టి కరిపించి కప్ గెలవాలని హార్డ్ కోర్ ఇండియన్ క్రికెట్ టీమ్ అభిమానులుగా కోరుకుందాం.

ALL THE BEST TEAM INDIA