మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఈరోజు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత జట్టు అద్భుత విజయం సాధించి ఫైనల్స్ కు దూసుకు వెళ్ళింది. 339 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన హర్మన్ ప్రీత్ సేన 9 బంతులు మిగిలి ఉండగానే గులుపు తీరాన్ని చేరుకుంది. జెమీమా రోడ్రిక్స్ 127 పరుగుల అజేయ సెంచరీతో ఆఖరి వరకూ క్రీజ్ లో నిలబడి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. ఇక నవీ ముంబై లో నవంబర్ 2 న జరిగే ఫైనల్ లో సౌత్ ఆఫ్రికతో టైటిల్ కోసం తలపడనుంది భారత జట్టు.
WWC : ఇండియా దెబ్బ.. ఆస్ట్రేలియా అబ్బా.. ప్రపంచ కప్ ఫైనల్లో భారత్
