కరూర్ దుర్ఘటనను మనం ఎలా అర్థం చేసుకోవాలి? తప్పు విజయ్ దేనా? లేక ప్రభుత్వానిదా?

టీవీకే పార్టీ అధినేత విజయ్ కరూర్ సభలో జరిగిన తొక్కిసలాట 39 మంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే. తరచు జరుగుతున్న ఈ తొక్కిసలాటలలో పదుల సంఖ్యలో ప్రాణాలను కోల్పోతున్నా పతిస్థితుల్లో మాత్రం మార్పు రావడంలేదు. అప్పటికప్పుడు ఏవో కారణాలు చెప్పడం తప్ప తర్వాత మళ్ళీ దాని గురించి పట్టించుకునే వారే లేకుండా పోయారు.

ఇదీ చదవండి : Analysis : అజేయంగానే ఫైనల్ కు.. కానీ ఆ లోపాల సంగతేంటి?

సంఘటనలు జరిగిన ప్రతిసారీ రాజకీయంగా విమర్శలు చేయడం ప్రభుత్వాలకు కూడా పరిపాటిగా మారింది. ఇలాంటి సమస్యలు ముఖ్యంగా సభ నిర్వహించే ఏరియాతో ముడిపడి ఉంటాయి. వచ్చే జనాలను అంచనా వేసి అందుకు తగ్గ స్థలాన్ని పోలీసు శాఖ కేటాయించాల్సి ఉంటుంది. కానీ వివిధ రాజకీయ కారణాలతో అప్రక్రియా సంక్రమంగా జరగడం లేదు. 10 వేల మందికే మేం పర్సమీషన్ ఇచ్చామని, 2 లక్షల మందికి పైగా వచ్చారని కరూర్ పోలీసులు చెవుతున్నారు. అది మేము అడిగిన స్థలం కాదని వేరే ఇరుకైన స్థలం కేటాయించారని టీవీకే చెపుతోంది. కానీ ఆ సభకు 2 లక్షల మంది వస్తారని రాష్ట్ర ఇంటిలిజెన్స్ కు తెలియదా? కేవలం 10వేల మందికే పర్మిషన్ ఇస్తే మిగిలిన వారు సభా ప్రాంతానికి వస్తుంటే ఎలా అమతించారు? 10 వేల మందికి ఐడీ కార్డులిచ్చి బహిరంగ సభకు అలౌ చెయ్యడం కుదిరే పనేనా? పోలీసులు చెప్పే ఇలాంటి కారణాలు కేవలం రాజకీయ ఒత్తిళ్లు ఉన్నపుడే వినిపిస్తాయనేది ఎవరు కాదనలేని వాస్తవం.

ఇదీ చదవండి : ఓటుకు నోటు కేసులో సుప్రీం తీర్పు ఈరోజే. సంచనాలు జరుగుతాయా?

అంత బహిరంగ సభ జరుగుతున్న ప్రాంతం వైపు అంబులెన్స్ ను ఎందుకు అనుమతించారనేది మరో మిలియన్ డాలర్ క్వశ్చన్. అదేసమయంలో పవర్ కట్ చేయడం తొక్కిసలాట తీవ్రతను పెంచిందనేది ప్రత్యక్ష సాక్షుల వెర్షన్. ఇవ్వన్నీ యాదృశ్చికంగా జరిగాయంటే నమ్మడం కొంచం కష్టమే.

ఇదీ చదవండి : Rohit Sharma : 10కేజీలు తగ్గిన హిట్ మ్యాన్! వరల్డ్ కప్ కు ఫిక్స్ చేసాకే..?

ఇక ఈ కారణాలన్నీ పక్కన పెడితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే బాధ్యత గల ప్రజాలుగా మనం ఆలోచిస్తున్న తీరు. కరూర్ సభ ప్రాంగణం నుండీ అనేకమంది పిల్లలు మిస్ అయ్యారంటే తప్పు ఎవరిది? చిన్న పిల్లల్ని తీసుకుని రాజకీయ బహిరంగ సభలకో, ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకో వాస్తన్నాం అంటే మన జ్ఞానం గురించి మనమే ఓ సారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒక వ్యక్తిపై అభిమానం ఉండొచ్చు కానీ అది మన జీవితాలను, మన కుటుంబాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉండకూడదు.

ఇదీ చదవండి IND vs PAK : ఆసియా కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్థాన్? ఫ్యాన్స్ కి పండగే..

ఏ నాయకుడు, ఏ హీరో తన సభలోనో

తన సినిమా వల్లో ప్రజలు చనిపోవాలని కోరుకోరు. అలాగే పరిస్థితులు చేజారిపోతున్న సమయంలో అప్పటికప్పుడు ఏమీ చేయనూ లేరు. ఆలోచించుకోవాల్సింది, సభలకు వెళ్ళినప్పుడు ఆచితూచి ప్రవర్తించాల్సింది మనమే. ఎదుకంటే ఏమన్నా జరిగితే అనుభవించాల్సింది మనం కుటుంబం కాబట్టి. పోయేది మన జీవితం కాబట్టి.