శివాలయంలో ప్రదక్షిణం ఎలా చేయాలో తెలుసా? మనం తప్పుగా చేస్తున్నాం..

శివాలయం లోపలికి ప్రవేశించగానే ముందుగా శిఖర దర్శనం చేసుకుని తరువాత మనం మొదటిగా చేసే పని ప్రదక్షిణం చేయడం. ఈ విధంగా శివాలయంలో మూడు ప్రదక్షిణలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. కానీ మిగతా దేవాలయాలతో పోల్చుకుంటే శివాలయం అనేది అనేక నియమ నిబంధనలతో కూడిన ఆధ్యాత్మిక ప్రదేశం. మిగతా అలయాలవలె ఇక్కడ సాధారణ నియమాలు వర్తించవు.

Read Also : శాఖాహార ప్రోటీన్ ‘పనీర్’ రుచులను ఆస్వాదించండి.. ప్రపంచ శాఖాహార దినోత్సవం ప్రత్యేక కథనం..

శివాలయంలో ప్రదక్షిణం చేసేటప్పుడు అన్ని ఆలయాల మాదిరిగా గుడి చుట్టూ తిరగకూడదని పండితులు చెప్తున్నారు. లింగ పురాణంలో దీనికి సంబంధించిన ఖచ్చితమైన నియమ నిబంధనలు సూచించబడ్డాయని తెలుస్తోంది. ఈ నియమం గురించి అర్థం కావాలంటే ముందుగా మనం “సామసూత్రం” అంటే ఏమిటో తెలుసుకోవాలి. అర్చకులు శివలింగంపై అభిషేకం కోసం నీరు లేదా ఇతర పాలు, తేనె వంటి పవిత్ర ద్రవాలు పోసినప్పుడు, అవి లింగంపై నుండి పానుపట్టంలోనికి జారీ ఒక దారిగుండా గర్భాలయం నుండి బయటకు వస్తాయి. గర్భాలయం యొక్క గోడ వెలుపల ఆ అభిషేక ద్రవం కిందకి కారదనికి ఒక త్రోవ కనిసిస్తూ ఉంటుంది. ఈ దారినే “సామసూత్రం” అంటారు.

Read Also : మళ్ళీ ఉత్తరాది – దక్షిణాది విభేదాల్ని రాజేసిన జీయస్టీ వ్యవహారం

ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ సామసూత్రం దాటుకుంటూ ప్రదక్షిణం చేయకూడదని శాస్త్రాలు చెప్తున్నాయి. ముందుగా ప్రదక్షిణాన్ని ధ్వజస్తంభం వెనుక నుండి మొదలు పెట్టాలి. తరువాత ఎడమవైపుగా నడుస్తూ చుట్టూ తిరిగి సామసూత్రం వద్దకు రావాలి తరువాత అక్కడ నుండి వెనక్కి వచ్చి ధ్వజస్తంభాన్ని దాటుకుంటూ మళ్ళీ సామసూత్రం వరకు వెళ్లి, మళ్ళీ వెనక్కు తిరిగి ధ్వజస్తంభం వరకూ రావాలి. అప్పుడు ఒక ప్రదక్షిణ పూర్తి అయినట్టు లెక్క. మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరున్న మనం ఎడమవైపుకు కదులుతూ ఈ విధానాన్ని కొనసాగించాలి. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. ఇలా ఒక ప్రదక్షిణం చేస్తే 10 వేల సాధారణ ప్రదక్షిణలు చేసిన పుణ్యం కలుగుంతుందని పండితులు తెలియజేస్తున్నారు.