భారత వన్డే కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ టెస్టుల నుండీ రిటైర్ అయ్యాక పెద్దగా క్రికెట్ ఆడడం లేదు. విరాట్ కు, రోహిత్ కు 2024 వన్డే వరల్డ్ కప్ మిస్ అవ్వడంతో అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు వారు కూడా బాగా హర్ట్ అయిన విషయం తెలిసిందే. ఇక 2027లో జారగాబోయే వన్డే వరల్డ్ కప్ లో వీరిద్దరూ ఆడాలని క్రికెట్ అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.
Also Read : Guntur : గుంటూరులో పనీపూరీపై నిషేధం
ఈ నేపధ్యంలో విరాట్ కు వరల్డ్ కప్ నాటికి 38 ఏళ్ళు రానుండగా రోహిత్ కు 40 సంవత్సరాలు వస్తాయి. ఇక కోహ్లీ ఫిట్నెస్ విషయానికొస్తే ఇప్పటికీ టాప్ లొనే ఉన్నాడు. ఈమధ్యనే జరిగిన యోయో ఫిట్నెస్ టెస్ట్ లో సైతం అందరికంటే ఎక్కువ ఫిగర్స్ తో క్వాలిఫై అయ్యి అందరినీ షాక్ ఇచ్చాడు.
Read Also : IND vs PAK : ఆసియా కప్ ఫైనల్లో ఇండియా – పాకిస్థాన్? ఫ్యాన్స్ కి పండగే..
ఇక రోహిత్ టెస్ట్ లో క్వాలిఫై అవ్వడమే కష్టమని టాక్ వినిపించింది. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ రోహిత్ ఫిట్నెస్ టెస్ట్ లో క్వాలిఫై అయ్యి తనలో ఇంకా సత్తా తగ్గలేదని రుజువు చేసాడు. ఇక ఇప్పుడు ఏకంగా 10కేజీల పైగానే బరువు తగ్గానని చెప్పుకొచ్చాడు. దీనితో 2027 వరల్డ్ కప్ లో రహిత్ శర్మ ఆడడం గ్యారెంటీ అనే సంకేతాలు ఇప్పటికే బీసీసీఆ నుండీ వచ్చాయని, అందుకే రోహిత్ ఇంత కష్టపడి ఫిట్నెస్ మైటైన్ చేస్తున్నాడని క్రికెట్ లవర్స్ అనుకుంటున్నారు. దీంతో మళ్లీ రో-కో ద్వయం వరల్డ్ కప్ లో ఆడటం ఖాయమని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
