దసరా నవరాత్రులు సమీస్తుండడంతో విద్యార్థుల్లో ఉత్సాహం నెలకొంది. తెలుగు రాష్ట్రాల్లో దసరాను పెద్ద పండుగగా పరిగణిస్తారు. విద్యార్థులకు సైతం ఒకేసారి పది రోజులు సెలవులు వచ్చే పరిస్థితి ఉండడంతో వీటికోసం ఎదురుచూస్తూ ఉంటారు.
Read Also : Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం దసరా సెలువుల తేదీలను ప్రకటించింది. ఈ నెల 24 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకూ 9 రోజుల పాటు దసరా సెలవులు ప్రకటిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే మైనారిటీ కాలేజీలకు ఈ నెల 27 నుండి అక్టోబర్ 2 వరకూ సెలవులు ఉండనున్నాయి. జూనియర్ కాలేజీలకు 28 నుండి అక్టోబర్ 5 వారకు సెలవులు ప్రకటించారు
Read Also : RGV : దర్శకుడు ఆర్జీవీపై ఐపీఎస్ అధికారిణి కేసు!
ఇక తెలంగాణాలో ఈ నెల 21 నుండి అక్టోబర్ 3వ తీదీ వరకు సెలవులు ఇచ్చారు. అలాగే జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుండి అక్టోబర్ 5 వరకూ సెలవులు ఉన్నాయి.
