Muhurath Trading : ముహూరత్ ట్రేడింగ్ సమయాల్లో మార్పు.. ఎప్పుడంటే?

ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భారతదేశ ట్రేడింగ్ విధానంలో దీపావళి రోజున స్పెషల్ ట్రేడింగ్ సెషన్ ను ఇండియన్ స్టాక్ మార్కెట్లు నిర్వహిస్తాయి. దీనినే ముహూరత్ ట్రేడింగ్ లేదా మూరత్ ట్రేడింగ్ అని పిలుస్తారు. ఈ సంప్రదాయం 1957 నుండీ ప్రారంభం అయింది. దీపావళి రోజున ఒక గంటపాటు ఈ ప్రత్యేక సెషన్ అందుబాటులో ఉంటుంది. ఈ సెషన్ లో కనీసం ఒక్క షేరైనా కొనాలని మదుపరులు భావిస్తారు. దీనిని అదృష్టంగా పరిగణిస్తారు. అలాగే వ్యాపారస్తులు సైతం తమ బ్యాలెన్స్ షీట్లను ఈరోజు క్లోజ్ చేస్తారు. అంటే దీపావళి నుండీ దీపావళి వరకూ ఒక వ్యాపార సంవత్సరంగా పరిగణిస్తారన్న మాట.

Also Read : అట్టుడికిపోతున్న అమెరికా.. ట్రంప్ కి దిమ్మతిరిగే షాక్

ఈసారి కూడా ఈ ముహూరత్ ట్రేడింగ్ ను గంటపాటు నిర్వహించనున్నారు. కానీ ఈ సారి ఈ ట్రడింగ్ సెషన్ లో చాలా మార్పులు జరిగాయి. అలాగే కొంత సంగ్దిగ్దత సైతం నెలకొంది. ఏటా ఈ ప్రత్యేక సెషన్ ను దీపావళి రోజు నిర్వహిస్తారు. కానీ ఈ సారి దీపావళిని దేశమంతా సోమవారం (అక్టోబర్ 20) న జరుపుకుంటూ ఉండగా ట్రేడింగ్ వర్గాలు మాత్రం అక్టోబర్ 21న సెలబ్రేట్ చేస్తున్నాయి. దాంతో 20న పూర్తి రోజు స్టాక్ మార్కెట్లు ఓపెన్ గానే ఉన్నాయి. ఈ విషయంలో సమాచారం సరిగా లేక కొంత గందరగోళ పరిస్థితి నెలకొంది.

Also Read : ఇండియన్ క్రికెటర్లను అవమానించిన ఆసీస్ క్రికెటర్లు

ఇక ఈ సంవత్సరం ఈ ముహూరత్ ట్రేడింగ్ వేళలు కూడా మారాయి. సాధారణంగా ఈ స్పెషల్ సెషన్ ను సాయంత్రం వేళల్లో నిర్వహిస్తారు. 2024లో సాయంత్రం 6 నుండీ 7 వరకు ఈ సెషన్ నడిచింది. కానీ ఈ సంవత్సరం ఈ సెషన్ ను మధ్యాన్నం 1:45 నుండి 2:45 వరకూ నిర్వహింస్తున్నారు. ప్రీ బుకింగ్ సెషన్ 1:30 కే ప్రారంభం కానుంది. సాయంత్రం వేళల్లో అమావాస్య వెళ్లిపోతుడటమే దీనికి కారణం. ఇక రేపు అంటే 22 అక్టోబర్ న బలిపూజ కారణంగా స్టాక్ మార్కెట్లను పూర్తిగా మూసివేయనున్నారు.