మన దేశంలో SSC లెవెల్లో అనేక బోర్డులు ఉన్నప్పటికీ సీబీయస్సీకి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ బోర్డ్ కరిక్యులమ్ ఫాలో అయ్యే విద్యార్థులు ఉన్నత ప్రమాణాలతో కూడిన మంచి విద్యను అభ్యాసం చేస్తారనేది కాదనలేని వాస్తవం.

Read Also : Ritika Nayak : రెడ్ శారీలో మెరిసిన మిరాయ్ బ్యూటీ
ఇది ఇలా ఉంటే తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విడుదల చేసిన నిబంధనలు విద్యార్థులకు షాక్ ఇస్తున్నాయి. ఈ విడ్యా సంవత్సరంలో 10వ తరగతి మరియు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 75 శాతం హాజరు ఖచ్చితంగా ఉండాలని, లేదంటే పరీక్షలు రాయడానికి అనుమతి లేదని బోర్డ్ స్పష్టం చేసింది. దీనితో ఒక్కసారిగా విద్యార్థులలో ఆందోళన నెలకొంది.
Read Also : Gen Z : ఇండియాలో జెన్ జీ పాపులేషన్ ఏ రాష్ట్రంలో ఎక్కువో తెలుసా?
సంవత్సరానంతర పరీక్షల అనంతరం ఫలితాల వెల్లడికి ఇంటర్నల్ అసెస్మెంట్ తప్పని సరి అని బోర్డ్ తెలిపింది. హాజరు శాతం 75% కన్నా తక్కువ ఉన్న విద్యార్థులతో ఈ అసెస్మెంట్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాబట్టి ఈ విద్యా సంవత్సరం నుండీ 75% హజరు నిబంధనను ఖచ్చితంగా పాటించి తీరాల్సిందేనని బోర్డ్ స్పష్టం చేసింది. సో, విద్యార్థులు ఇక మీరు బుద్దిగా స్కూలుకు వెళ్ళక తప్పదు!
