BSNL ఈసిమ్ సేవలు ప్రారంభం. సిమ్ లేకుండానే కాల్స్..

ఈ కాలంలో టెక్నాలజీ రోజురోజుకీ పెరిగిపోతూ వస్తోంది. ఒకప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు వాడేవాళ్ళం. తర్వాత సిమ్ ఆధారితంగా పనిచేసే వైర్లెస్ ఫోన్ కాల్స్ కోసం సెల్ ఫోన్లు వాడాం. తర్వాత అందులో స్మార్ట్ ఫోన్లు వాడకం లోనికి వచ్చాయి. ఇది సెల్యులర్ యుగంలో ఓ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. ఇంటర్నెట్ మూసేజ్ పెరగడం, ఏఐ అవిర్భావంతో అసలు సెల్ ఫోన్ వాడే విధానమే మారిపోయింది.

Read Also : Vijaya Dasami : విజయ దశమికి, జమ్మి చెట్టుకు సంబంధం ఏమిటి?

ఇక ఇప్పుడు భారత సెల్యులర్ డవలెప్మెంట్ ఎరాలో మరో మైలు రాయి ఆవిష్కృతమైంది. ప్రభుత్వ సెల్ సర్వీస్ సంస్థ BSNL టాటా కమ్యూనికేషన్స్ తో కలిసి ఈసిమ్ టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. దీని సహాయంతో ఫోన్ లో సిమ్ లేకుండానే కాల్స్ అండ్ మెసేజెస్ చెయ్యొచ్చు. ఇంటర్నెట్ కూడా వాడుకోవచ్చు.

Read Also : Chiru Movie Update : శశిరేఖను పరిచయం చేసిన అనిల్ రావిపూడి

క్యూఆర్ కోడ్ ను స్కాన్ చెయ్యడం ద్వారా ఈ సర్వీసులను ప్రారంభించవచ్చు అని BSNL యాజమాన్యం తెలిపింది. 2G, 3G, 4G వేరియట్స్ లో ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇప్పటికే తమిళనాడులో ఈ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభం కాగా రాబోయే 2, 3 నెలలలో దేశ వ్యంప్తంగా ఈ ఈసిమ్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.