నన్ను నా కుటుంబంతో సహా అంతమొందించేందుకు కుట్ర చేసారని మాజీ మంత్రి, ఎమ్యల్సి భత్సా సత్యన్నారణ సంచలన కామెంట్స్ చేశారు. దీనితో ఏపీ రాజకీయాల్లో ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది.
Also Read : ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి బిగ్ రిలీఫ్
వివరాల్లోకి వెళితే విజయనగరంలో ప్రతి సంవత్సరం లాగానే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బొత్సా తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూర్చుని ఉత్సవాన్ని తిలకించడానికి ఏర్పాట్లు చేశారు అధికారులు. వేడుక జరుగుతుండగా ఒక్కసారిగా వారు కూర్చున్న వేదిక కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఒక ఎస్సైతో పాటు ఓ చిన్నారికి గాయాలయ్యాయి. బొత్సా, కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారు.
Also Read : తెలంగాణ స్థానిక ఎన్నికలు ఆగడానికి కారణమైన ఆ పిటీషనర్ ఎవరో తెలుసా?
ఈ సంఘటనపై బొత్సా తీవ్రంగా స్పందించారు. నన్ను, నా కుటుంబాన్ని ఒకేసారి అంతమొందించడానికి కుట్ర పన్నారని. ఇది మరీ దారుణమని అన్నారు. అమ్మవారి దయ వల్ల బయటపడ్డామని, ఇలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ సంఘటనపై వివరించేందుకు త్వరలో గవర్నర్ ని కలుస్తామన్నారు. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారనేది బయటికి రావాలన్నారు.
