ఏపీలో ప్రస్తుతం ఏర్పాటవనున్న గూగుల్ డేటా సెంటర్ రాజకీయ పార్టీల మధ్యలో అగ్గి రాజేస్తోంది. ఇప్పటికే ప్రతిపక్షం దీనిపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఇది గూగుల్ డేటా సెంటర్ మాత్రమే కాదని, ఇది ఆధాని – గూగుల్ డేటా సెంటర్ అని, దీని ఏర్పాటు ప్రక్రియను జగన్ అధికారంలో ఉన్ననాడే ప్రారంభించారని చెప్పుకొస్తోంది వైసీపీ. అలాగే అప్పటి నిర్ధారిత ప్రమాణాల ప్రకారం ఈ డేటా సెంటర్ ఏర్పాటు జరగడం లేదని, కేవలం ఈ డేటా సెంటర్ తో కూటమి ప్రభుత్వం చెప్తున్నట్టు లక్షా 80 వేల ఉద్యోగాలు ఏమీ రావని అంటున్నారు. అలాగే డవలప్మెంట్ సెంటర్ కూడా పక్కనే రావాలని అలా కాకపోతే కనీసం ఒక వెయ్యి ఉద్యోగాలు వచ్చే పరిస్తితి కూడా ఉండదని వైసీపీ. వాదిస్తోంది. పర్యావరణ ప్రమాదాలను పరిగిణలోకి తీసుకోవాలని అంటోంది.
Also Read : Rashi Singh : ‘ప్రసన్న వదనం’ ఫేమ్ రాశీ సింగ్ ఫోటో గ్యాలరీ
ఇదిలా ఉంటె అటు టీడీపీ మాత్రం లోకేష్, చంద్రబాబు కృషివల్లే ఇది సాధ్యమైందని చెప్పుకొస్తోంది. అలాగే కూటమి ప్రభుత్వం ఈ డేటా సెంటర్ కోసం మూడు ప్రాంతాల్లో 480 ఎకరాలను కేటాయించనుంది. రూ.22 వేల కోట్ల రాయితీలను సైతం ప్రకటించింది. ఈ పరిణామంతో కేవలం 200ల ఉద్యోగాల కోసం ఇన్ని రాయితీలు అవసరమా అని విమర్శలొస్తున్నాయి.
Also Read : Analysis : రాజ్యాధికారం ఇస్తామనిచెప్పి బీసీలను మళ్ళీ రోడ్డెక్కించారు. ఈ తప్పెవరిది?
ఇదిలా ఉంటె ఇప్పుడు ఈ గూగుల్ డేటా సెంటర్ వ్యవహారం కూటమిలోనూ చీలికలు తీసుకొస్తోంది. ఈ డేటా సెంటర్ పై బీజేపీ ఏపీ ఆద్యుక్షుడు మాధవ్, ఎమ్యల్యే విష్ణు కుమార్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ డేటా సెంటర్ ద్వారా 1.80 లక్షల ఉద్యోగాలు వస్తాయనేది అవాస్తవమని అంగీకరించారు. అలాగే ఈ డేటా సెంటర్ ద్వారా పరిసర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికంగా పెరుగుతాయని, విద్యుత్ వినియోగం విపరీతంగా ఉంటుందని అన్నారు. నీరు కూడా బాగా అవసరమౌతుందని అన్నారు. పర్యావరణంపై ప్రభావం పడకుండా చూడడం పెద్ద సవాలని విష్ణుకుమార్ రాజు అన్నారు. దీనితో ఇప్పటి వరకు లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు, లోకేష్‌లు చేస్తున్న ప్రచారాలను బీజేపీ పెద్దలే తిప్పికొట్టినట్లు అయింది. కూటమి పార్టీ నేతలు చేస్తున్న ఈ పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.
