ఈ రోజే నాగుల చవితి. నాగపూజకు సరైన సమయం ఎదో తెలుసా?

అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో నాలుగొవ రోజున చవితి నాడు నాగుల చవితీగా జరుపుకుంటూ ఉంటాము. ఈరోజు ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం అత్యంత శ్రేష్టదాయకం అని వేదాలు తెలియ జేస్తున్నాయి. ఇక ఈరోజు నాగపూజకు సరైన సమయాన్ని పండితులు సూచిస్తున్నారు. ఉదయం గం. 8:56 ని. నుండీ గం. 10:35 ని. మధ్య సమయం అత్యంత పవిత్ర సమయమని చెప్తున్నారు. ఈరోజు నాగపూజ చేసి పుట్టలో పాలు పోయడం వల్ల కుజ దోషం, కాలసర్ప దోషం, కళత్ర దోషం వంటివి తొలగిపోతాయని పురాణాలు తెలియజేస్తున్నాయి.

Also Read : కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం. అగ్నికి ఆహుతైన ప్రయాణికులు

ఇక భక్తితో పుట్టకు నమస్కరించి, కష్టాలు చెప్పుకుని, పుట్టలో పలు పోసి 5 ప్రదక్షిణలు చేస్తే కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. సంతానం లేని వారు, పెళ్లికాని వారు ఇలా చేస్తే ఫలితాలు ఉంటాయని చెప్తున్నారు. ఇక ఈరోజు పుట్టలో పాలు పోయడం వలన సర్వదోషాలు టోలుగుతాయని తెలుస్తోంది. మన దేవతలకు సంబంధించి ఈ సర్ప గణాలతో అనేక సందర్భాల్లో ప్రాధాన్యత ఇవ్వబడింది. విష్ణుమూర్తి అదిశేషునిపై పవళిస్తారు. పరమేశ్వరుడు పాముని మెడలో ధరిస్తారు. అలాగే క్షీర సాగర మాధనంలో సైతం వాసుకి అనే సర్పాన్నే కవ్వంగా ఉపయోగించారు.

Also Read : ఏపీలో గూగుల్ వార్.. టీడీపీకి బీజేపీ ఝలక్

యోగశాస్త్రం ప్రకారం మన శరీరం యొక్క మూలాధార చక్రం నందలి కుండలి శక్తి పాము రూపంలో నిద్రిస్తూ ఉంటుంది. ఇది కామము, క్రోశము వంటి చెడు లక్షణాలకు సంకేతంగా ఉంటుంది. నేడు పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఈ అంతర్గత కల్మషం శుభ్రమై మన జీవం మక్ష మార్గం వైపు ప్రయాణిస్తుంది.